Kolkata Rape Case: పోలీసులు డబ్బులు ఇవ్వాలని చూశారు.. మృతురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు!

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్ హత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.

Kolkata Rape Case: పోలీసులు డబ్బులు ఇవ్వాలని చూశారు.. మృతురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు!
New Update

Kolkata Rape Case: దేశంలో సంచలనంగా మారిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్ హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు గురించి సంచలన విషయాలు బయటపెట్టారు మృతురాలి తల్లిదండ్రులు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసు విచారణలో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును వేగంగా క్లోజ్ చేయడానికి తమకు డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారని అన్నారు. సాక్షాలు తారుమారు చేసేందుకు తమ కూతురు అంతక్రియలు వేగంగా జరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న మృతురాలికి న్యాయం దక్కాలంటూ కోల్‌కతాలో చేసిన నిరసన కార్యక్రమంలో హత్యాచారానికి గురైన బాధిత వైద్యురాలి తల్లి దండ్రులు పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మృతురాలి తండ్రి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.." ఈ కేసును అసలు విషయాలు బయటకు రాకుండా పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారని అన్నారు.

వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు పోలీసులు అనేక మార్గాల్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. చనిపోయిన తమ కూతురుని చూసేందుకు కూడా తమని అనుమతించలేదని వాపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే పోస్ట్‌మార్టం పూర్తయ్యేంతవరకు తమను ఉంచారని అన్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తుండగా.. ఓ సీనియర్‌ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పాడని.. కానీ, తాము ఆ డబ్బు తీసుకోడానికి నిరాకరించినట్లు చెప్పారు.

#kolkata-rape-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe