Police Martyrs Memorial Day: అమరవీరులకు ఆదిమూలపు నివాళులు...పాల్గొన్న పోలీస్ అధికారులు

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల సేవలు మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు.

New Update
Police Martyrs Memorial Day: అమరవీరులకు ఆదిమూలపు నివాళులు...పాల్గొన్న పోలీస్ అధికారులు

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలార్పించిన పోలీస్ అమరవీరులకు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ ఏఎస్‌. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మలికగర్గ్, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, పోలీసు అధికారులు ఘనంగా నివాళులార్పించి పుష్పాంజలి ఘటించారు. పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు.

ఎంతోమంది ప్రాణాలను కాపాడిన్నారు

ఈ సందర్భముగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పోలీసుల సేవలను కొనియాడారు. ఆపద సమయంలో ప్రజలకు, వారి ఆస్తులకు అండగా నిలిచే పోలీసులే ప్రజలకు నిజమైన స్నేహితులని స్పష్టం చేశారు. దేశ సమగ్రతను, సరిహద్దులను చెరగనీయకుండా తమ రక్తాన్ని ధారపోసి కోట్లాది మంది కోసం పోలీసులు అమరులవుతున్నారన్నారు. వివిధ సందర్భాల్లో వారి ప్రాణత్యాగం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని మంత్రి అన్నారు. కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో పోలీసులు ముందు వరుసలో నిలబడి తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా నియంత్రించుటకు విధులు నిర్వర్తించారని ఆదిమూలపు సురేష్‌ కొనియాడారు. శాంతి భద్రతలను కాపాడడంలోనూ, అవసరమైన సమయంలో సమాజ సేవ చేయడంలోనూ ముందుంటున్న పోలీసుల సంక్షేమానికి సీఎం జగన్‌ ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రత, రక్షణ కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ వీరులు, వారి కుటుంబ సభ్యులకు మాగుంట ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న పోలీసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ప్రాణాలను కోల్పోయిన 188 మంది పోలీస్ బలగాల సిబ్బంది యొక్క పేర్లులను ASP శ్రీధర్‌రావు చదివి వినిపించి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..సోయి తెచ్చుకొని మాట్లాడాలని ఫైర్

Advertisment
తాజా కథనాలు