Police lathi charge: ఆదిలాబాద్ రైతులపై పోలీసుల లాఠీఛార్జి.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్ TG: పత్తి విత్తనాల కొరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డుకు రెండు పత్తి బ్యాగుల చొప్పునే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. By V.J Reddy 28 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Farmers Protest At Adilabad: ఆదిలాబాద్ రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విత్తనాల కోసం షాపుల దగ్గర బారుల తీరారు రైతులు. నాణ్యమైన విత్తనాలు దొరకక రైతుల ఇబ్బందులు పడుతున్నారు. పత్తి పంట కోసం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కొరతతో ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల చొప్పునే పంపిణీ చేస్తున్నారు అధికారులు. దాంతో షాపుల దగ్గర రైతులు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేశారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులను తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఘాటుగా స్పందించారు. ఆయన ట్విట్టర్ (X) లో.. "కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..?, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..?, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి." అని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్… pic.twitter.com/DxNp3MrEs6 — Harish Rao Thanneeru (@BRSHarish) May 28, 2024 Also Read: తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందుకే.. ఢిల్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు #brs-mla-harish-rao #farmers-protest #police-lathi-charge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి