Nursing Student : RTV చేతిలో కారుణ్య డెత్ ఎఫ్ఐఆర్.. తల్లి బయటపెట్టిన నిజాలివే! భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి కళాశాల నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుణ్య తండ్రి గురుమూర్తి ఫిర్యాదుతో సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారుణ్యది హత్యేనని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది. By srinivas 29 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kothagudem : భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి కళాశాల (Maruthi College) నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) పగిడిపల్లి కారుణ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుణ్య (Karunya) తండ్రి గురుమూర్తి ఫిర్యాధు మేరకు సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే తన బిడ్డ కారుణ్యది హత్యేనని బాధితురాలి తల్లి ఆర్టీవీ (RTV) తో గోడు వెల్లబోసుకుంది. కారుణ్య భవనంపైకి నుంచి దూకినట్లు తమకు తెలిసిందని ఫిర్యాదులో కారుణ్య తండ్రి గురుమూర్తి పేర్కొన్నారు. కారుణ్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్, సూసైడ్ నోట్ బుక్ (Suicide Note Book) ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం పోలీసులు తెలిపారు. Also Read : కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం అలాగే కారుణ్యమృతి ఘటనకు సంబంధించిన ఆధారాలు ఎవరివద్ద ఉన్నా అందజేసి సహకరించాలని కోరారు. ఇక కారుణ్య మృతి ఘటనలో మొదటి నుంచి సూసైడ్ నోట్ ను ఆర్టీవీ ప్రస్తావిస్తూ వస్తుంది. అయితే కారుణ్య మృతి కేసు పరిశోధనలో ఉన్నందున ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఘటనపై దుష్ప్రచారం చేయకూడదని పోలీసుల హెచ్చరించారు. దీంతో పోలీసులు యాజమాన్యంతో మిలాఖత్ అయ్యారని ఆరోపిస్తున్నారు దళిత సంఘాల నేతలు. కేసును నిర్వీర్యం చేయడంలో భాగంగా కళాశాల యాజమాన్యం రూ. 25లక్షలు మృతురాలి కుటుంబానికి అందించేలా పోలీసులు మధ్యవర్తిత్వం వహించారని ఆరోపిస్తున్నారు. కారుణ్య మృతికి సంబంధించిన సీసీ ఫుటేజ్, సూసైడ్ నోట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #kothagudem #nursing-student #karunya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి