/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cm-jagan-3.jpg)
CM Jagan: సీఎం జగన్ లండన్ పర్యటన సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటారని పోలీసులకు ఓ వ్యక్తి మెయిల్ చేయడం కలకలం రేపింది. మెయిల్ చేసిన వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ తుళ్లూరి లోకేష్‌గా పోలీసులు గుర్తించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా డాక్టర్ లోకేష్ తిరిగినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పర్యటన వివరాలను ఇతరులకు మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో డాక్టర్ లోకేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
విదేశీ పర్యటనలో సీఎం జగన్..
నాంపల్లి కోర్టు అనుమతితో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లారు. కాగా విదేశీ పర్యటనలో భాగంగా ముందు ఆయన లండన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 31న ఆయన తిరిగి ఏపీకి రానున్నారు. విదేశీ పర్యటనకు వెళుతున్న సీఎం జగన్ కు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు సెండాఫ్ ఇచ్చారు. దాదాపు 15 రోజులపాటు సీఎం జగన్ ఏపీకి దూరంగా ఉండనున్నారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బిజీగా గడిపిన సీఎం జగన్.. విదేశీ పర్యటనతో కుటుంబ సభ్యులతో గడపనున్నారు.