Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో.. ఓ యువతి తన ఇంట్లో దొంగలు పడి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. సమాచారం మేరకు పోలీసులు రావడంతో.. చివరికి ఆమె కట్టుకథ అల్లినట్లు తేలింది. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడి డబ్బు పోవడంతో ఈ డ్రామా చేసిందనట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్

Hyderabad Rajendranagar Incident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింది. చివరికి పోలీసుల విచారణలో ఆమె కట్టుకథ అల్లినట్లు తేలడంతో అందరూ షాకైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆ యువతి ఒక్కసారిగా ఇంట్లో కేకలు వేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఏమైందని అడిగారు. దీంతో ఆ యువతి.. ఇద్దరు ముసుగు వేసుకున్న దొంగలు ఇంట్లోకి వచ్చి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. వాళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించగా నన్ను తోసేసి పారిపోయారని చెప్పింది.

Also Read: Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

దీంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అలాగే క్లూస్‌ టీమ్‌ను కూడా రంగంలోకి దింపారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించారు. కానీ ఎక్కడా కూడా ఎవరూ అనుమానస్పదంగా వచ్చినట్లు, దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆ యువతిని పోలీసులు గట్టిగా నిలదీశారు. చివరికి అసలు విషయం బయటపడింది. ఆమె చెప్పిందంతా.. కట్టుకథ అని తేలింది.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఆమె ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.25 వేలు పోగొట్టుకుంది. స్నేహితుల నుంచి అప్పు తీసుకొని మరీ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడింది. వాళ్లు డబ్బులు తిరిగెచ్చాయని అడగడంతో.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు స్టోరీ అల్లింది. అందరిని నమ్మించేందుకు బీరువాలో ఉన్న దుస్తులు తానే చిందరవందరంగా పడేసింది. ఆ తర్వాత గట్టిగా కేకలు వేసి డ్రామాకు తెరలేపింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు కథ బయటపడింది.

Also Read: రూ.లక్ష కోట్ల స్కామ్.. మహిళా వ్యాపారికి మరణశిక్ష..

Advertisment
తాజా కథనాలు