/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EVM-jpg.webp)
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 70.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అయితే ఈ ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ కచ్చితమైన గణాంకాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా..సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో నిన్న రాత్రి EVMను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి (EDC)కి EVMలు తీసుకెళ్తుండగా.. నాగారం మండలం పేరబోయినగూడెం వద్ద కొంత మంది వ్యక్తులు సెక్టార్ అధికారి వాహనాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేశారు. గోడౌన్ లో పెట్టటానికి ప్రైవేట్ EVM లను కారులో తరలిస్తున్నారంటూ వీడియోలు తీసి ప్రచారాలు చేశారు. ఆ కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు.
Also Read: ఆ ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది.. మళ్లీ పోలింగ్ నిర్వహించాలి..
దీంతో సెక్టార్ అధికారి నాగారం మండల వ్యవసాయ అధికారి గణేష్.. తమ విధులకు ఆటంకం కలిగించి, తప్పుడు ప్రచారాలు చేశారంటూ తుంగతుర్తి, నాగారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింది 2 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.