Andhra Pradesh : జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసుల దాడి..

పోలింగ్ తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 15న తెల్లవారుజామున 3 గంటలకు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు.

New Update
Andhra Pradesh : జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసుల దాడి..

Police Attack : ఏపీ(AP) లో పోలింగ్(Polling) తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రి(Tadipatri) లో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ నెల 15న తెల్లవారుజామున 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy), కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో తాజాగా బయటపడింది. ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు. నిద్రిస్తున్న కార్యకర్తల పైనా కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీకి చెందిన దాసరి కిరణ్, పెద్దారెడ్డి మనిషి ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవల్లో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు