TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ఎవరంటే..? టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది ప్రశాంత్‌కు ప్రశ్నాపత్రం చేరవేశాడు. ప్రశాంత్ ఇండియాకు చేరుకోవడంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. By B Aravind 05 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSPSC Paper Leak Case: ఇటీవల టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 100 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి చిక్కాడు. నగర సీసీఎస్/సిట్ పోలీసులు శనివారం న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్(31)కు కూడా గ్రూప్ 1 ప్రశ్నపత్నం చేరవేసి పరీక్ష రాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లీకేజీ కేసులో పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను కీలక నిందితులుగా గుర్తించారు. Also Read: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణం ఇదే.. ఆ తర్వాత ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు అలాగే దళారులను గుర్తించి అరెస్టులు చేశారు. ఇక న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు సిట్ పోలీసులు నోటీసులు పంపారు. కానీ అతని నుంచి ఎలాంటి సరైన స్పందన రాలేదు. దీంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేశారు. రెండు రోజుల క్రితమే నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనంతరం సిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి శనివారం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. చివరికి న్యాయస్థానం రిమాండ్ విధించగా ప్రశాంత్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. Also Read: నాటుకోడి కూర, బగరా రైస్ వండిన మంత్రి కేటీఆర్! #telangana-news #tspsc #tspsc-paper-leak-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి