Drugs case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. మస్తాన్‌ సాయి అరెస్ట్‌!

రాజ్‌తరుణ్‌, లావణ్య వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌ సాయిని గుంటూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూన్‌ 24న విజయవాడలో డ్రగ్స్‌ దొరకగా.. ఈ కేసులో మస్తాన్ ను పోలీసులు A4గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ చేశారు.

Drugs case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. మస్తాన్‌ సాయి అరెస్ట్‌!
New Update

Rajtarun: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌ సాయిని గుంటూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడలో SEB ఆపరేషన్‌లో దొరికిన డ్రగ్స్‌ కేసులో A4గా కేసు నమోదు చేయగా అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు మస్తాన్‌సాయి.

వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ డ్రగ్స్‌ కేసులోనూ..

జూన్‌ 24న 35 గ్రాముల డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఓ బ్యాచ్ పట్టుబడింది. ఇందులో మస్తాన్ సాయి కూడా ఉండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ A4గా కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతనికోసం నిఘాపెట్టి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం గుంటూరు లో పట్టుబడగా అరెస్ట్‌ చేసిన విజయవాడకు తరలించారు. హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌

డ్రగ్స్‌ కేసులోనూ మస్తాన్‌సాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

#police-arrested #drug-case #mastan-sai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe