Fake Police : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!

దేశంలో ఫేక్ పోలీసు ముఠాలు రెచ్చిపోతున్నాయి. కాల్ గర్ల్స్, రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారే టార్గెట్‌గా అందినంత దోచేస్తున్నారు. ఫేక్ ఐడి కార్డ్స్, వాట్సప్ డీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Fake Police : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!
New Update

Fake Cop Cases : దేశవ్యాప్తంగా నకిలీ పోలీస్ (Fake Police) ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారిని టార్గెట్ చేస్తూ భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. స్టార్ హోటల్స్ లను అడ్డాలుగా చేసుకుని కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకున్న కష్టమర్స్ ను బ్లాక్ మెయిల్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఈసీ అధికారులం, పోలీసులం అంటూ హోల్‌‌‌‌సేల్‌‌‌‌ వ్యాపారులను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రౌడీ షీటర్లు, వివిధ పార్టీల గల్లీ లీడర్లు, దో నంబర్‌‌‌‌‌‌‌‌ దందా ఎక్కువగా జరిగే హోల్‌‌‌‌సేల్‌‌‌‌ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్‌‌‌‌ చేసి అందినంత దోచేస్తున్నారు. సెల్ ఫోన్లలోనూ పోలీసుల డీపీలు పెట్టుకుని దర్జాగా దోచేస్తున్నారు.

నకిలీ ఐడి కార్డు చూపించి..
ఇటీవల ఓ మహిళను బెదిరించి రూ.10 లక్షలు కాజేయగా పోలీసులు అరెస్ట్ చేయగా.. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. సన్నీ అనే వ్యక్తి 2023 ఫిబ్రవరిలో సికింద్రాబాద్ (Secunderabad) మారియట్ హోటల్ వద్ద ఒక లేడీ కస్టమర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు. తాను పోలీసునంటూ నకిలీ ఐడి కార్డు చూపించి న్యూడ్ వీడియోస్ (Nude Videos) పబ్లిక్ చేస్తాననని రూ.5 లక్షలు, 2 తులాల బంగారు గొలుసు తీసుకోగా ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ లో తాను పోలీస్‌ కానిస్టేబుల్‌ అంటూ ఏకంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా అశ్విని అనే యువతి అనేక మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. అంతేకాకుండా ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకుని వారితో బలవంతంగా చోరీలు చేయిస్తోంది. ఈ మాయలేడీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు..
అలాగే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (East Zone Taskforce Police) పట్టుకున్నారు. వనపర్తి జిల్లాకు కడవత్ సోమ్లా నాయక్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కానీ 2012 సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పి పోలీస్ శాఖలో చేరాలనుకునే యువతను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేశాడు. దాదాపు రూ.11 లక్షల వరకు దోచేయగా చివరికి అరెస్ట్ అయ్యాడు.

జీఎస్టీ సహా ఇతర ట్యాక్స్‌‌‌‌లను తప్పించుకునేందుకు హోల్ సెల్ వ్యాపారులు రెండు రకాల దందా చేస్తుంటారు. బిల్‌‌‌‌తో ఎక్కువ రేటు, బిల్‌‌‌‌ లేకుండా తక్కువ ధరకు అమ్మకాలు జరుపుతారు. ఇలాంటి చోట డిజిటల్, ఆన్​లైన్ పేమెంట్స్‌‌‌‌ కాకుండా డబ్బులు మాత్రమే తీసుకుంటారు. దీంతో ప్రతి వ్యాపారి వద్ద నోట్ల కట్టలు ఉంటాయి. ఈ డబ్బును వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయరు. ట్యాక్స్‌‌‌‌లు, అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. రోజువారి కలెక్షన్‌‌‌‌తో ఇంటికి వెళ్తున్న వ్యాపారులను కేటుగాళ్లు టార్గెట్‌‌‌‌చేస్తున్నారు.

మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి..
రాత్రి వ్యాపారులు ఇంటికి వెళ్లే సమయాల్లో హోల్‌‌‌‌సేల్‌‌‌‌ మార్కెట్ల వద్ద సంచరిస్తున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురికి పైగా ఉంటున్నారు. వ్యాపారులు కొద్ది దూరం వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకుంటున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి బెదిరిస్తున్నారు. డబ్బును ఈసీకి అప్పగించకుండా ఉండాలంటే ఎంతో కొంత ఇచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలా వారం రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యాపారులను బెదిరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే డయల్ 100కు లేదా స్థానిక పీఎస్‌‌‌‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలే గోషామహల్‌‌‌‌కు చెందిన హోల్‌‌‌‌సేల్‌‌‌‌ వ్యాపారి సాయంత్రం ఇంటికెళ్తుడగా ఇద్దరు యువకులు బైక్ అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. వ్యాపారి వద్ద రూ.5 వేలు తీసుకుని వదిలేశారు.

ఇక పంజాబ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ముసుగులో వ్యక్తుల నుండి డబ్బు వసూలు చేసిన ఛవానీ మొహల్లా నివాసి అన్మోల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జోధేవాల్ పోలీసులు పోలీసు యూనిఫాంలు కుట్టించి విక్రయించే స్థానిక టైలర్‌ను నామినేట్ చేశారు. నిందితుడు దుకాణం నుంచి పోలీసు యూనిఫాంను కొనుగోలు చేయడమే కాకుండా, పంజాబ్ పోలీసు గుర్తింపు కార్డు నమూనాను కూడా పొందాడని దర్యాప్తులో వెల్లడైంది.

ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read : నైజీరియన్ వ్యక్తి వద్ద రూ. 6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం!

#india #fake-cop-cases #police-noties
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe