AP State Festival: వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర

పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైయింది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. 1992లో దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పోలేరమ్మ ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖవారు తీసుకొచ్చారు. పోలేరమ్మ జాతరను సాంప్రదాయంగానే రాజులు సూచన, సలహాలతో నిర్వహిస్తున్నారు.

New Update
AP State Festival: వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర

Venkatagiri Poleramma Jathara: పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైయింది. ఇప్పటికే ఘటోత్వాన్ని నిర్వహించారు. ఈనెల 4,5న  జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలేరమ్మవారిని అమ్మవారినిగా భావించే వెంకటగిరిలో చాకలివీధిలో పుట్టమట్టితో చాకలి కుటుంబాల వారు తయారు చేస్తారు. అమ్మవారిని ఇక్కడ కళ్ళు మాత్రం పెట్టకుండా అలంకరిస్తారు. అత్తవారిల్లుగా భావించే జీనుగుల వారి వీధికి తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ కళ్ళు పెట్టి బంగారు నగలతో అలంకరిస్తారు. అక్కడ నుంచి లక్షలాది మంది భక్తుల నడుమ రథంపై ఊరేగింపుగా అమ్మవారి గుడి వద్దకు తీసుకువచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు.

పోలేరమ్మ జాతరకు రాష్ట్ర పండగ గుర్తింపు

భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం అమ్మవారిని నిరూపణ చేసేందుకు భక్తులు మధ్య ఊరేగింపుగా కలివేలమ్మ వీధిలోని నిరూప మండపం వరకు తీసుకొని వెళ్లి అక్కడ అమ్మవారిని నిరూపణ చేస్తారు. ఆ సమయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకుంటారు. పోలేరమ్మ జాతరకు వెంకటగిరి నుంచి ఇతర దేశాలు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు పాల్గొంటారు. మతాలకు అతీతంగా అందరూ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. పోలేరమ్మ జాతర మా పూర్వీకుల నుంచి జరుగుతున్నట్లు రాజ వంశస్థులు ఎస్‌వీబీసీ ఛైర్మన్ సాయికృష్ణ తెలిపారు. జాతర ఎప్పటి నుంచి జరుగుతున్నది స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని వందల సంవత్సరాలగా జరుగుతుందన్నారు. పోలేరమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని చెప్పారు. ఈసారి రాష్ట్ర పండగ గుర్తింపు పోలేరమ్మ అమ్మవారి జాతరను ఘనంగా సంబరాలతో నిర్వహించాలని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయం ఈవో శ్రీనివాసులురెడ్డి తెలిపారు. జాతరను రాష్ట్ర పండుగ సీఎం జగన్ గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్‌, పార్కింగ్ వంటి ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు.

కలరా వ్యాధి తగ్గి ప్రజలు సుఖసంతోషాలతో...

సీఎం జగన్‌ (CM Jagan) వెంకటగిరికి వచ్చిన సందర్భంగా వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు జాతరను రాష్ట్ర పండుగ గుర్తించాలని కోరడంతో సీఎం వెంటనే ప్రకటించారు. 21 రోజుల్లోనే పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగ గుర్తిస్తూ.. జీవో ఇప్పించారు. పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ గుర్తించడంతో వైభవంగా చేయాలని నేదురుమల్లి, అధికారులు ప్రయత్నాలు చేశారు.  అయితే.. 1700 సంవత్సరం నుంచి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. రాజుల కాలంలో వెంకటగిరిలో కలరా వ్యాప్తి చెందడంతో భారీగా ప్రాణనష్టం జరగడంతో శీతల యాగాన్ని నిర్వహించారు. రాళ్లపై శీతల యంత్రాన్ని చెక్కించి పట్టణంలో నలుమూలల ప్రతిష్టించారు. బజార్ వీధిలోని పోలేరమ్మ గుడి దగ్గర శీతల యంత్రం ప్రసిద్ధిగాంచిందిగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. శీతల యాగం చేయడంతో కలరా వ్యాధి తగ్గి ప్రజలు సుఖసంతోషాలతో  ఉన్నారు.  అప్పటి నుంచి శీతల యాగం చేస్తూ వచ్చారు. కాలక్రమమైన శీతల యాగం బదులుగా పోలేరమ్మ జాతరగా నిర్వహిస్తున్నారు. క్రమం తప్పకుండా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వెళ్లినాక జాతరను మొదలు పెడతారు.

Also Read: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!

Advertisment
తాజా కథనాలు