MLA Balaraju: ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.. ఎమ్మెల్యే బాలరాజు షాకింగ్ కామెంట్స్.!
రాష్ట్రంలో రాక్షస పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోనన్నారు. పోలవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు.
MLA Chirri Balaraju: ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించగా ప్రజలంతా పండగ చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు రాక్షస పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని విమర్శలు గుప్పించారు. జగన్ పరిపాలనతో రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని కొనియాడారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గంకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నియోజకవర్గ ప్రజలు కొత్తవారిని కోరుకున్నారన్నారు. పోలవరం ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోనన్నారు. పోలవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

Also Read: అన్నట్టుగానే జరిగింది.. ఎమ్మెల్యే ధర్మరాజు కీలక వ్యాఖ్యలు.!