PNB Recruitment 2024: బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించుకోవాలని కలలు కనే వారికి ఇది గుడ్‌న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1,000 కంటే ఎక్కువ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో pnbindia.in బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1,025 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఫిబ్రవరి 25, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
ఆఫీసర్-క్రెడిట్: 1,000 పోస్ట్‌లు
మేనేజర్-ఫారెక్స్: 15 పోస్టులు
మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 5 పోస్టులు
సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 5 పోస్టులు
ఎంపిక ప్రక్రియ:
ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూ తర్వాత, ఒక్కో పోస్ట్‌కు వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులు రూ. 50 + 18శాతం GST అంటే మొత్తం రుసుము రూ. 59 చెల్లించాలి. ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 + 18శాతం GST అంటే మొత్తం రూ. 1,180 చెల్లించాలి. డెబిట్ కార్డ్ (రూపే/వీసా/మాస్టర్ కార్డ్), క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్/మొబైల్ వాలెట్ లేదా UPI ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా మేం కింద మీ కోసం ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయవచ్చు.
CLICK HERE FOR NOTIFICATION DETAILS
Also Read: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్ నోటిఫికేషన్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే!
WATCH: