Bihar: గురుద్వారాలో లంగర్ సేవలో ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లోని గురుద్వారాలో హల్ చల్ చేశారు. ఆరెంజ్ టర్బన్ ధరించిన మోదీ పాట్నా సాహిబ్‌ను సందర్శించి..లంగర్ సేవలో పాల్గొన్నారు.

New Update
Bihar: గురుద్వారాలో లంగర్ సేవలో ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ ప్రస్తుతం బీహార్లో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అక్కడ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రోడ్ షో నిర్వహించిన మోదీ ఈరోజు శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను సందర్శించారు. దీని తరువాత హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్‌లలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బారీ బహిరంగ షబల్లో మాట్లాడనున్నారు. ఇక ఈరోజు గురుద్వారాకు ప్రధాని మోదీ ఆరెంజ్ టర్బన్ ధరించి వెళ్ళడమే కాకుండా..అక్కడ లంగర్ సేవలో కూడా పాల్గొన్నారు. భక్తులకు తన చేతులతో స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు.

బీహార్‌లో ప్రధాని మోదీ దర్శించిన గురుద్వారాను తఖత్ శ్రీ పాట్నా సాహిబ్, తఖత్ శ్రీ హరిమందిర్ జీ, పాట్నా సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది రాష్ట్ర రాజధానిలో ఉన్న సిక్కుల ఐదు తఖత్‌లలో ఒకటి. గురుగోవింద్ సింగ్ జన్మస్థలం గుర్తుగా 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ చేత తఖత్ నిర్మాణం చేశారు. గురు గోవింద్ సింగ్, పదవ సిక్కు గురువు. 1666లో పాట్నాలో ఆయన జన్మించారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌కు వెళ్లడానికి ముందు గురు గోవింద్ సాహిబ్ ఇక్కడే గడిపారు.

Advertisment
తాజా కథనాలు