New Delhi: 'సనాతన ధర్మ' వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. సరైన విధంగా స్పందించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కామెంట్స్ చేసిన ఉదయనిధి (Udayanidhi Stalin).. తాజాగా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మంలోని వివక్షకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ చేసిన ఒక రోజు తరువాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సరైన స్పందన అవసరం అని రియాక్ట్ అయ్యారు ప్రధాని.
జీ20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద 'సనాతన ధర్మ' వ్యాఖ్యపై సరైన సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై ఎవరూ మాట్లాడవద్దని మంత్రులకు సలహా ఇచ్చారు. 'చరిత్రలోకి వెళ్లవద్దు, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి. అలాగే, సమస్య సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడండి' అని కేబినెట్ భేటీలో మంత్రులకు సూచించారు ప్రధాని మోదీ.
హిందూ సంఘాల ఆగ్రహం.. తగ్గేదేలే అంటున్న ఉదయనిధి..
సనాతన ధర్మం ఒక వ్యాధితో సమానమని, దానిని నిర్మూలించాల్సిందేనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంఊ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్, హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. అయితే, క్షమాపణలు చెప్పేందుకు ఉదయనిధి నిరాకరించారు. తన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా.. తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఖరాకండిగా చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమిళనాడు గవర్నర్ అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఉదయ నిధి కామెంట్స్‌ని పొలిటికల్‌గా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఉదయనిధి కామెంట్స్.. హిందూ సమాజ నిర్మూలనను ప్రేరేపిస్తుందని, వారు హిందూ సమాజానికి వ్యతిరేకులు అంటూ బీజేపీ వాదిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు దీనిని ఒక ఆయుధంలా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఆ మేరకు సోషల్ మీడియాలో దూకుడు పెంచింది. విపక్ష నేతలంతా హిందూ సమాజ వ్యతిరేకులంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మిత్రపక్షాల రియాక్షన్స్ ఇవీ..
ఇక ఈ వివాదాంపై విపక్ష పార్టీలు ఒక్కోటి ఒక్కో రకంగా స్పందించాయి. అన్ని మతాలను గౌరవించాలని, అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రజలందరికీ ఉంటుందని కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించింది. ప్రియాంక్ ఖర్గే, కార్తీ చిదంబరం వంటి కాంగ్రెస్ యువనేతలు.. ఈ వివాదంలో జూనియర్ స్టాలిన్‌కు అండగా నిలిచారు. సీపీఎం జాతీయ కార్యదర్శి డి రాజా కూడా ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థించారు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కాంగ్రెస్‌లోని పలువురు నేతలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం
Kangana Ranaut: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన కంగనా.. ఆమె ఎవరో తెలియదు?