/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/modi-2.jpg)
Modi - Biden : జీ 7 సదస్సు (G7 Summit) కు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు. మోదీ ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ని మోదీని కలిశారు.
వారిద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరువురూ కాసేపు ముచ్చటించారు. వీరి సమావేశంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించారు. ‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలవడం ఎల్లప్పుడూ సంతోషకరంగానే ఉంటుంది. మెరుగైన ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు భారత్-అమెరికా ఉమ్మడిగా పాటు పడుతూనే ఉంటాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇరువురి కలయికకు సంబంధించిన ఫొటోలను మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడితో భేటీకి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలపై వారు చర్చించారు. ఇంధనం, రక్షణ, పరిశోధన, సాంస్కృతికంతో పాటు వివిధ రంగాలలో సహకార ప్రయత్నాల గురించి మాట్లాడుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పురోగతి ఉందని అధ్యక్షుడు మాక్రాన్ ఆనందం వ్యక్తం చేశారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడంలో అవరోధంగా ఉన్న ప్రధాన సమస్యలపై మోదీ మాక్రాన్ చర్చించారు. చర్చించారు. ముఖ్యంగా రక్షణ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో నిబద్ధతను పాటించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. జీ7 సదస్సులో భాగంగా యూకే ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా మోదీ కలిశారు. జూన్ 13-15 మధ్య ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగింది.
It's always a pleasure to meet @POTUS @JoeBiden. India and USA will keep working together to further global good. 🇮🇳🇺🇸 pic.twitter.com/Xzyvp5cLCq
— Narendra Modi (@narendramodi) June 14, 2024
Also read: స్కాట్‌లాండ్ పై జర్మనీ ఘన విజయం.. మిగిలిన టీమ్స్ కు హెచ్చరిక.