ప్రణబ్-మోదీ బంధం విచిత్రంగా ఉండేది.. సంచలన విషయాలు చెప్పిన శర్మిష్ట ముఖర్జీ..

ప్రధాని నరేంద్ర మోదీ.. దివంగత నేత ప్రణబ్ ముఖర్జీని ఎప్పుడు కలిసినా ఆయన పాదాలకు నమస్కరించేవారని శర్మిష్ట ముఖర్జీ తెలిపారు. తాజాగా ప్రణబ్ మై ఫాదర్ పేరుతో బుక్ రాసిన ఆమె.. ఇందులో సంచలన వివరాలు పేర్కొన్నారు. ప్రణబ్ తన డైరీలో రాసిన అంశాలను ఈ బుక్‌లో పేర్కొన్నారు.

New Update
ప్రణబ్-మోదీ బంధం విచిత్రంగా ఉండేది.. సంచలన విషయాలు చెప్పిన శర్మిష్ట ముఖర్జీ..

Pranab Mukherjee - Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే ప్రణబ్‌ను కలిసిన ప్రతిసారి ప్రధాని మోదీ ఆయన పాదాలకు నమస్కరిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ వెల్లడించారు. తాజాగా 'ప్రణబ్ మై ఫాదర్' పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని రచించిన ఆమె.. ఆ బుక్‌లో అనేక కీలక వివరాలను పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికైనప్పుడు.. తన విధులు, బాధ్యతల గురించి చాలా స్పష్టమైన విజన్‌తో ఉండేవారన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఉన్నారు. భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ.. ఎలాంటి విషయాల్లోనూ తాను జోక్యం చేసుకోనని, పాలన విషయంలో తన విధులు తాను నిర్వర్తిస్తానని ప్రధాని మోదీకి ప్రణబ్ చెప్పినట్లు శర్మిష్ట పేర్కొన్నారు.

వీరిద్దరి భిన్నమైన సిద్ధంతాలను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా వింతంగా అనిపించేదన్నారు. కానీ, వీరిద్దరి బంధం చాలా సంవత్సరాల ముందు నుంచే ఉందన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే ప్రణబ్‌తో సత్ససంబంధాలు ఉన్నాయని శర్మిష్ట పేర్కొన్నారు. 'గతంలో ప్రధాని మోదీ సాధారణ పార్టీ కార్యకర్తగా ఉండేవారు. వివిధ కార్యక్రాల కోసం ఢిల్లీకి వచ్చేవారు. ఉదయం వాకింగ్ సమయంలో బాబాను(ప్రణబ్ ముఖర్జీ) కలిసేవారు. మోదీతో బాబా చాలా బాగా మాట్లాడేవారు. బాబాను ఎప్పుడు కలిసినా పాదాలకు నమస్కరించేవారు' అని చెప్పుకొచ్చారు శర్మిష్ట ముఖర్జీ. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో కూడా రాసినట్లు తెలిపారామే.

publive-image

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ రాష్ట్రపతిని కలవడానికి వచ్చినప్పుడు జరిగిన ఘటనను ప్రణబ్ తన డైరీలో విషయాన్ని పేర్కొన్నారట. 'మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తారు. కానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ నా పాదాలను తాకి నమస్కరించేవాడు. అది అతనికి సంతోషాన్నిస్తుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు.' అని ప్రణబ్ పేర్కొన్నారు శర్మిష్ట ముఖర్జీ తెలిపారు.

'రాష్ట్రపతి, ప్రధానమంత్రి మధ్య సంబంధాలు కేవలం వ్యక్తిగత సంబంధంపై నిర్మించబడలేదు. రాష్ట్రపతిగా, ఎన్నికైన ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని బాబా విశ్వసించారు.' అని చెప్పారామె. ఈ కారణంగానే.. 'మొదటి సమావేశంలోనే ప్రణబ్ చాలా నిక్కచ్చిగా మోడీకి క్లారిటీ ఇచ్చారు. రెండు భిన్నమైన సిద్ధాంతాలకు చెందినవాళ్ళం. కానీ ప్రజలు మీకు అవకాశం, ఆదేశాలు ఇచ్చారు. నేను పాలనలో జోక్యం చేసుకోను.. అది మీ పని.. కానీ మీకు ఏదైనా రాజ్యాంగపరమైన విషయంలో సహాయం కావాలంటే, నేను అక్కడ ఉంటాను.' అని మోదీతో ప్రణబ్ చెప్పారట.

Also Read:

బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?

తెలంగాణ సీఏంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు