తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు రావడానికి ముందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు సంబంధించి పేర్కొన్న మూడు ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా ఈ తొమ్మిదేళ్లలో అమలు చేయని ప్రధాని మోదీ కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ శంకుస్థాపనకు రావడానికి సిద్ధం కావడం విడ్డూరంగా ఉందన్నారు. By Vijaya Nimma 02 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ కన్ఫామ్ ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ కన్ఫామ్ అయింది. జూలై 8న వరంగల్‌కు ప్రధాని మోడీ రానున్నారు. కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌తో పాటు.. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మోడీ. బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే యోచనలో బీజేపీ ఉంది. దీంతో ప్రధాని బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే జూలై 8న హైదరాబాద్‌లో జేపీనడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది. తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు.. రాష్ట్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేస్తుంటే దానిని పక్కన పెట్టేసి, కేవలం వ్యాగన్‌ల మరమ్మతు వర్క్‌షాప్ ప్రారంభించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తెలంగాణకు హామీ ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోయారని విమర్శించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.21 వేల కోట్లు కేటాయించారని వెల్లడించారు. విభజన చట్టంలోని రెండో అంశమైన ములుగు గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 360 ఎకరాల స్థలం కేటాయించినా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చేసిందేమీ లేదన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. గ్రీన్ బడ్జెట్ ప్రభుత్వంపెంచింది ఈ 3 హామీలు నెరవేర్చనందుకు మోదీ వరంగల్ పర్యటనకు ముందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. జల్.. జంగల్.. జమీన్ నినాదం స్ఫూర్తిగా పోడు భూములకు పట్టాల పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల గిరిజన కుటుంబాలకు 4.06 లక్షల ఎకరాలకు పట్టాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా 5 లక్షల 13 వేల ఎకరాల్లో 2.40 కోట్ల మొక్కలను నాటి పది శాతం గ్రీన్ బడ్జెట్‌ను కేటాయించుకుని అడవుల శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి