నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నిన్న జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభలో జన సముద్రాన్ని చూశానన్నారు. మళ్లీ అలాంటి జన సముద్రాన్ని నాగర్ కర్నూల్ లో చూస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే దేశ ప్రజలు ఫలితాలను చెబుతున్నారన్నారు. మరో సారి ప్రజలు మోదీ ఫ్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ వ్యాప్తంగా 400కు పైగా పార్లమెంట్ సీట్లను సాధించబోతోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మోస పూరిత రాజకీయాలను ప్రజలను నమ్మడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ విజయాన్ని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణను దేశానికి దక్షిణ ముఖ ద్వారంగా చెబుతారన్నారు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నలిగిపోయిందన్నారు. కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలన్నారు.
తెలంగాణలోని అన్న ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిస్తేనే సస్యశ్యామలమైన తెలంగాణను చూస్తామన్నారు. 7దశాబ్ధాలుగా కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేసిందన్నారు. పేదరికాన్ని నిర్మూలన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పేదల జీవితాల్లో మార్పు తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. పేదలకు అకౌంట్ లను ఓపెన్ చేయించి వారి జీవితాల్లో మార్పు తెచ్చామన్నారు. దేశంలో 25వేల కోట్ల మంది పేదలను పేదరికం నుండి బయటకు తీసుకురాగలిగామన్నారు. తెలంగాణలో కూడా పేద ప్రజల జీవితాలను వెలుగులోకి తెస్తామన్నారు. నేను మీ నుండి ఓటు తీసుకునేది తన సొంత ప్రయోజనాలకోసం కాదన్నారు.
ప్రతీ కుటుంబం మోదీ కుటుంబమే..
23 ఏళ్లుగా దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. అధికారాన్ని తన సొంత ప్రయోజనాల కోసం ఎన్నడూ వాడుకోలేదన్నారు. ఆరోగ్య భీమా ద్వారా పేద ప్రజలకు చేరువయ్యామన్నారు. 67 లక్షలకు పైగా తెలంగాణ లో ముద్ర లోన్లు ఇప్పించామన్నారు. తమ పథకాలను పేద ప్రజలకు అందకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు.
తెలంగాణలో దళితులకు గౌరవం లేదు..
తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కను కింద కూర్చో బెట్టి అగ్రవర్ణాలు పైన కూర్చుని దళితులను అవమానం చేశాయని ధ్వజమెత్తారు మోదీ. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పడం కెసిఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. దళిత బంధు పేరుతో కోట్ల రూపాయల అక్రమాలకు బీఆర్ఎస్ తెరలేపిందన్నారు.