/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-6-jpg.webp)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర 50 రోజుల్లో 11 కోట్ల మంది ప్రజలకు చేరువైందన్నారు. దేశంలో అర్హులైన ఏ ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన ఇలా వ్యాఖ్యనించారు.
చాలామంది ప్రదలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలపై అవగాహన ఉండటం లేదని.. వాళ్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సంకల్ప్ యాత్ర చేపట్టామని ప్రధాని మోదీ అన్నారు. నవంబర్ 15న ఈ సంకల్ప్ యాత్రను ప్రారంభించగా.. ఆ తర్వాత ఉజ్వల్ పథకానికి 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అలాగే ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత దాదాపు కోటికీ పైగా టీబీ, 22 లక్షల సికిల్ సెల్ ఎనీమియా టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్.. శాసనాసభా పక్ష నేత ఆయనేనా..?
అయితే వీటి బారినపడ్డవారు వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉన్నారని అందులో ఎక్కువగా దళితులు, ఆదివాసీలు ఉన్నారని అన్నారు. ఇంతకుముందు ఏదైన ఆరోగ్య సమస్య వస్తే వైద్యుల దగ్గరికి వెళ్లేవాళ్లమని.. ఇప్పుడు డాక్టర్లే రోగుల వద్దకు వచ్చి ట్రీట్‌మెంట్ చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నామని.. అలాగే ఎలాంటి ఖర్చులు లేకుండా డయాలసిస్‌లు చేస్తున్నామని తెలిపారు.
Also read: టైమ్స్ స్క్వేర్‌లో రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..
దేశంలో ఎన్నో జెనరేషన్లు తమ కలలను సాకరం చేసుకోలేకపోయారని.. వాటిని నేరవేర్చేందుకే కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువకులను ఆయన నాలుగు కులాలుగా అభివర్ణించారు. అంతేకాదు వారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.