PM Modi: ఐదేళ్ల తరువాత రష్యాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో మోదీ పర్యటించనున్నారు. రష్యాలో 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొననున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. కాగా ఐదేళ్ల తరువాత మోదీ రష్యాకు వెళ్తున్నారు.

PM Modi: ప్రధాని మోదీ పర్యటన.. రష్యా సంచలన నిర్ణయం
New Update

PM Modi: ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఐదేళ్ల తరువాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో మోదీ పర్యటించనున్నారు. రష్యాలో 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొననున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారని తెలిపింది. రష్యా పర్యటన ముగించుకున్నాక మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తారని వెల్లడించింది. గత 41 సంవత్సరాల్లో ఆస్ట్రియాను భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. రష్యాలో చివరిసారిగా మోదీ 2019లో వ్లాడివోస్టాక్ పట్టణంలో ఆర్థిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

#pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe