Modi On security Breach : పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై మోదీ సీరియస్‌.. మంత్రులతో ఏం అన్నారంటే?

పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ సీరియస్‌ అయ్యారు. భద్రతా లోపాలను సీరియస్‌గా తీసుకోవాలని మోదీ సీనియర్ మంత్రులను కోరారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాల జోలికి వెళ్లవద్దని.. మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Modi On security Breach : పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై మోదీ సీరియస్‌.. మంత్రులతో ఏం అన్నారంటే?
New Update

Modi On security Breach : పార్లమెంట్‌(Parliament) లో భద్రతా ఉల్లంఘన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ(Lok Sabha) లోపలకు ఇద్దరు వ్యక్తులు దూసుకురావడం.. స్మోక్‌ స్టిక్స్‌ యూజ్‌ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సెక్యూరిటీ బ్రీచ్‌ ఈ లెవల్‌లో జరగడం దురదృష్టకరమని ఫైర్ అవుతున్నాయి. ఎంపీలకే భద్రత లేకపోతే సామాన్యులను ఏం కాపాడతారని విమర్శిస్తున్నాయి. అటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit shah) ఇప్పటివరకు మాట వరుసకైనా నోరు విప్పిందిలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభలో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని నిన్నటి(డిసెంబర్‌ 13)నుంచి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అమిత్‌షా రిజైన్ చేయాలని నినాదాలు చేశారు ప్రతిపక్ష ఎంపీలు. మరోవైపు ప్రధాని మోదీ(Modi) సైతం ఏం మాట్లాడడంలేదని ఆరోపిస్తున్న వేళ తాజాగా ఆయన స్పందించినట్లు సమాచారం. లోక్‌సభలో దాడి ఘటనపై మంత్రులతో మాట్లాడారు మోదీ.

రాజకీయాలోద్దు:
లోక్‌సభలో దాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్‌ అయ్యారు. లోక్‌సభలో భద్రతా లోపాలను సీరియస్‌గా తీసుకోవాలని మోదీ సీనియర్ మంత్రులను కోరినట్లు సమాచారం. 'ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోండి.. రాజకీయాల జోలికి వెళ్లవద్దు.. మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలి' అని సమావేశంలో ఆయన మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ కార్యక్రమాల సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు దూకారు. బెంచీలపైకి ఎక్కి స్మోక్ గన్‌లతో పొగను వ్యాపింపజేశారు. దీంతో పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. పలువురు ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో ఆరుగురు ఎంపీలు యువకుడిని చుట్టుముట్టారు. అతన్ని పట్టుకుని, ఆపై భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లోకి సాధారణ పౌరుల ప్రవేశ నిబంధనలను కఠినతరం చేశారు. అంతే కాకుండా ఇకపై షూస్‌ను కూడా డీప్‌గా చెక్‌ చేయనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పార్లమెంట్ ఉభయ సభల్లోని ప్రేక్షకుల గ్యాలరీలను మూసివేశారు. మరోవైపు పార్లమెంట్‌లో సెక్యూరిటీ ఉల్లంఘనపై లోక్‌సభలో వాడివేడి వాదనలు జరిగాయి. హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. అయితే సభను సజావుగా సాగనివ్వడంలేదని 14మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.

Also Read: విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

WATCH:

#narendra-modi #parliament-attack #modi-on-security-breach
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe