/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-20T141226.283-jpg.webp)
PM Modi : భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో మరింత దుమారం రేగింది. పలువురు విపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంటు మెట్లపై నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్ర పతి ధన్ కర్(Dhan Kar) ప్రవర్తన శైలిని అనుకరించారు. అయితే ఈ తతంగాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో మరింత వైరల్ అయింది.
అయితే కళ్యాణ్ ప్రవర్తన తీరుపట్ల ఉపరాష్ట్రపతి ధన్ కర్ అసహనం వ్యక్తం చేశారు. తన రైతు జీవితాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని అవమానించారంటూ ఆవేదన చెందారు. దీంతో ధన్ కర్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా బాడీ షేమింగ్ చేస్తూ అవమానించడం బాధకరమన్నారు. 'నేను 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అయితే నాకు ఎదురైన అవమానాలను ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నా' అంటూ ఉపరాష్ట్రపతి ధన్ కర్ ధైర్యం చెప్పారు ప్రధాని మోడీ(PM Modi) . ఇక ఈ ఇష్యూపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఉపరాష్ట్రపతిని అవమానించడం బాధాకరమంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి : మద్యం మత్తులో యువతి బీభత్సం.. కారు కింద నలిగిపోయిన స్నేహితులు: వీడియో
ఇదిలావుంటే.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ను అవమానించలేరని, ఆయన మాత్రమే తనను తాను అవమానించుకుంటారని మహువా మొయిత్రా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో పార్లమెంట్లో ప్రధాని మోడీ ఇతర గౌరవనీయ ఎంపీలను అనుకరిస్తూ, అవమానించిన గత వీడియోలను మహువా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.