Modi: జాతీయ యువజన దినోత్సవం.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. స్వామి వివేకనందా జయంతి సందర్భంగా జాతీయ యూత్‌ ఫెస్టివల్‌గా పాల్గొన్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునేవారు మన ప్రజాస్వామ్యానికి ఓ కొత్త శక్తిని తీసుకొస్తారంటూ ఆయన యువతను కొనియాడారు.

New Update
PM Modi : వారందరికీ ప్రధాని మోదీ గుడ్ న్యూస్...పీఎఫ్, ఇన్సూరెన్స్ తోపాటు మరిన్ని సౌకర్యాలు..!!

National Youth Festival 2024: ఈరోజు స్వామీ వివేకనంద జయంతి. ఎంతోమంది యువతకు స్పూర్తి నింపిన ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జాతీయ యూత్‌ ఫెస్టివల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ' వలస పాలకుల చేతిలో బానిసత్వం అనుభవించిన భారతదేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపిన వ్యక్తికి ఈరోజు అంకితం. స్వామి వివేకనందా జయంతికి (Swami Vivekananda Jayanti) నేను ఇలా మీతో ఉండటం ఆనందంగా ఉంది.

యువత వ్యక్తిత్వం, నిబద్ధతపైనే భారతదేశ ఆకాంక్షలు ఆధారపడి ఉంటాయని వివేకనంద చెబుతుండేవారు. యువతీ, యువకులు సొంత ఆలోచనలతోనే ముందుగు వెళ్తే.. దేశానికి ఉన్న లక్ష్యాలు సాధించవచ్చని ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీఅరబిందో విశ్వసించేవారు. ప్రస్తుతం ఇండియా ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా మారాలి. నైపుణ్యాలు కలిగి శ్రామిక శక్తితో ఉన్న దేశంగా ఈరోజు భారత్.. ప్రపంచదేశాలకు కనిపిస్తోంది.

Also Read: 14వేల కోట్లకు మేఘా విడాకులు..పీపీరెడ్డిని బయటకు పంపేసిన కృష్ణారెడ్డి

దేశంలోని యువతీ, యువకులు యోగా, ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్లుగా కూడా మారుతున్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునేవారు మన ప్రజాస్వామ్యానికి ఓ కొత్త శక్తిని తీసుకొస్తారని ప్రధాని మోదీ యువతను కొనియాడారు. ఇదిలాఉండగా.. ఛత్రపతి శివాజీ మాతృమూర్తి అయిన జిజియా బాయి జయంతి కూడా ఈరోజే. అయితే ఆమె గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. జిజియా బాయిని నారీ శక్తి చిహ్నంగా అభివర్ణించారు.

భారత్‌కు చెందిన ఎందరో మహనీయులకు మహారాష్ట్రతో సంబంధం ఉందని ప్రధాని అన్నారు. నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో శ్రీరాముడు కూడా చాలాకాలం పాటు ఉన్నారని తెలిపారు. అయితే ఈ నెల 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు, మందిరాల్లో శుద్ధి కార్యక్రమం చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Also Read: ఇకనుంచి గ్రామాల్లో కూడా వాతావరణ సమాచారం.. వచ్చే వారం నుంచే అమలు..

Advertisment
తాజా కథనాలు