PM Modi: మోదీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!!

New Update
PM Modi: మోదీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!!

PM Modi:  ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏమాత్రం తగ్గలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్...మోదీకి రోజురోజూకీ పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా దేశంలో మోదీ నాయకత్వాన్ని 78శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా..17శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడైంది. మార్నింగ్ కన్సల్ట్ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల ఆమోదం రేటింగ్స్ ను ఈమధ్యే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 మధ్య సేకరించింది. ఈ డేటా ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా టాప్ ర్యాంక్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ రేటింగ్స్ ప్రతి సర్వే చేసిన దేశంలో పెద్దలలో ఏడురోజుల సగటు అభిప్రాయాలను సూచిస్తుంది. లక్షజనాభా తదనుగుణగా మారుతుంది. ఈ పద్ధతి విధానం జనాభా, భౌగోలిక పరిస్థితులను అంచనా వేసి ప్రజాధరణ పొందిన వ్యక్తుల వివరాలను వెల్లడిస్తుంది.

ఆ తర్వాత 63 శాతం రేటింగ్‌తో అర్జెంటీనా ప్రధాని జావీర్‌ మిలే 3వ స్థానంలో, 52 శాతం రేటింగ్‌తో పోలాండ్‌కు చెందిన డొనాల్డ్‌ టస్క్‌ 4వ స్థానంలో, స్విట్జర్లాండ్‌ ప్రధాని వియోలా అమ్‌హర్డ్‌ 51 శాతం రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్‌ వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. వారి నాయకత్వాన్ని 46 శాతం మంది ప్రజలు ఆమోదించగా.. ఇటలీ మాజీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ సర్వేలో 8వ స్థానంలో నిలిచారు. 41 శాతం మంది ఇటలీ వాసులు ఆమె నాయకత్వాన్నికై జై కొట్టారు. అటు స్పెయిన్‌కు చెందిన పెడ్రో, బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ డి క్రూ 38 శాతం ప్రజామోదంతో వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచారు.

publive-image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ జాబితాలో 11వ స్థానంలోకి వెళ్లిపోయారు. బైడెన్‌ నాయకత్వాన్ని 37 శాతం మంది మాత్రమే కోరకుంటున్నారు.. 55 శాతం మంది ఆయన్ను తిరస్కరిస్తున్నారు. ఈ సర్వేలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 29 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కేవలం 23 శాతం మాత్రమే ఆమోదం లభించిందని సర్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ?