PM Modi: సముద్రగర్భంలోని ద్వారకాకు ప్రధాని మోదీ పూజలు కొన్ని నెలల తేడాలోనే ప్రధాని మోడీ మరోసారి అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రగర్భంలో ఉన్న ద్వారకను దర్శించుకున్నారు ప్రధాని మోడీ. స్కూబా డైవింగ్ చేసి మరీ అక్కడ ఉన్న శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. By Manogna alamuru 25 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బెట్ ద్వారకా దీపం దగ్గర ప్రధాని మోడీ ఈరోజు స్కూబా డైవింగ్ చేశారు. అక్కడ సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాను దర్శించుకున్నారు. హిందువుల అతి పురాతనమైన ద్వారకా నగరానికి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా సముద్ర గర్భంలో ఉందని హిందువులు విశ్వసిస్తారు. దీనికి బోలెడు కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ద్వారకానే ప్రధాని దర్శించుకున్నారు. #WATCH | PM @narendramodi's deep sea Dwarka Darshan PM Modi went underwater, in the deep sea and prayed at the site where the submerged city of #Dwarka is. This experience offered a rare and profound connection to India's spiritual and historical roots. @PMOIndia… pic.twitter.com/T2tI5ZASTz — DD News (@DDNewslive) February 25, 2024 అదో అద్భుతమైన అనుభవం.. స్కూబా డైవింగ్ సూట్ వేసుకుని అరేబియా సముద్రంలోకి దిగారు ప్రధాని మోదీ. తర్వాత నీటి అడుగున ఉన్న ద్వారకా నగరం అవశేషాల దగ్గరకు వెళళి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన అనుభవాలను, ఫోటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సముద్రగర్భాన ఉన్న ద్వారకాలో పూజలు చేయడం ఓ దివ్యానుభవం అని ప్రధాని పేర్కొన్నారు. కాలాతీతమైన భక్తిని అనుభవించానని చెప్పారు. భారతీయులందరినీ అనుగ్రహించమని శ్రీకృష్ణుడుని వేడుకొన్నాని తెలిపారు. ఒక్కసారిగా పురాతన కాలాల్లోకి వెళ్ళినట్టు అనిపించిందని...అదొక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకొచ్చారు మోదీ. తాను స్కూబా డ్ఐవింగ్ చేసిన ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇంతకు ముందుకూడా ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. లక్షద్వీప్‌లో సముద్రంలో దిగిన ప్రధాని అక్కడి ఫోటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా.. భారతదేశంలో గుజరాత్‌లో ద్వారకా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ద్వారకా , పురాతన కాలంలో ఉన్న ద్వారకా.. ఒకటి కాదని చెబుతారు. జరాసంధుడు బారి నుంచి ప్రజలను కాపాడ్డానికి శ్రీకృష్ణుడు విశ్వకర్మకు ద్వారకాను నిర్మించమని చెప్పాడు. అప్పుడు నిర్మించినదే ఇప్పుడు సముద్రగర్భంలో ఉన్న ద్వారకా అని చెబుతారు. శ్రీ కృష్ణుడు చనిపోయిన తర్వాత పాత ద్వారకా మునిగిపోయిందని చెబుతారు. సముద్ర గర్భంలో పెద్ద బడబాగ్ని దాగుందని...దాన్ని బయటకు రాకుండా కాపాడుతున్నది శ్రీ కృష్ణుడే అని కూడా హిందువులు విశ్వసిస్తారు. వీటన్నింటికీ ఆధారాలు లేకపోయినా...సముద్రగర్భంలో ఒక నగరం మాత్రంనిక్షిప్తమై ఉన్న మాట మాత్రం వాస్తవం. #pm-modi #dwaraka #arabia-sea #scooba-diving మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి