/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-pragn-jpg.webp)
Modi meets Praggnanandhaa: భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. 18 ఏళ్ల టీనెజ్ సంచలనం, ఇటీవల FIDE ఫైనల్‌లో రజత పతకం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగానే మోదీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రజ్ఞానంద ట్విట్టర్‌లో షేర్ చేయగా. దాన్ని మోదీ రీట్వీట్ చేశారు. "గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలవడం గొప్ప గౌరవం!" ప్రజ్ఞానంద తన ట్వీట్‌లో రాశాడు. "ఈరోజు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, మీ కుటుంబంతో పాటు. మీరు అభిరుచి, పట్టుదలని వ్యక్తీకరిస్తారు. దేశ యువత ఏ డొమైన్‌ను ఎలా జయించగలదో చూపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది" అని మోదీ రీట్వీట్ చేశారు.
మోదీకి సిల్వర్ మెడల్ ని చూపిస్తున్న ప్రాగ్ఫైనల్లో ఓటమి:
18 ఏళ్ల ప్రాగ్ FIDE ఫైనల్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయాడు. అయితే ప్రాగ్ చూపించిన పట్టుదలకు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. ప్రపంచంలోని టాప్ చెస్ ప్లేయర్లను ఓడించి చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన తర్వాత ప్రజ్ఞానంద ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాడు. ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా ఫైనల్‌కు చేరి ప్రజ్ఞానంద అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించాడు. టై బ్రేక్‌లో ఒత్తిడికి గురికావడంతో ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు.
It was a great honour to meet Hon'ble Prime Minister @narendramodi at his residence!
Thank you sir for all the words of encouragement to me and my parents🙏 pic.twitter.com/dsKJGx8TRU— Praggnanandhaa (@rpragchess) August 31, 2023
రూ.30లక్షల చెక్:
చెన్నైలో జన్మించిన ప్రజ్ఞానంద భారత్‌కు చేరుకున్న తర్వాత ఆయనకు చెన్నై విమానాశ్రయంలో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రజ్ఞానంద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆ రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కూడా చెన్నైలో సమావేశమయ్యారు. సీఎం స్టాలిన్ ప్రజ్ఞానందపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడుతో పాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన కనబర్చాడని సీఎం కొనియాడారు. ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు. ఇక ప్రజ్ఞానంద 2018 సంవత్సరంలో 12 సంవత్సరాల 10 నెలల 13 రోజుల వయస్సులో రెండవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇటలీలో జరిగిన గ్రెడిన్ ఓపెన్‌లో లుకో మొరోనిని ఓడించడం ద్వారా అతను అసాధారణ విజయాన్ని సాధించాడు. 2022లో ఆన్‌లైన్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ తర్వాత ప్రజ్ఞానంద మూడో భారతీయుడు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడు. కేవలం 18 ఏళ్ల వయసున్న ప్రగ్నానంద, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాను టై బ్రేకర్‌లో ఓడించాడు.
ALSO READ: ఆరు రోజులు.. మూడు విజయాలు.. వేల జ్ఞాపకాలు..భారతీయుల గుండెల్లో ఈ వారం పదిలం!
Follow Us