PM Modi: పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పాకిస్థాన్ ఎంత శక్తిమంతమైందో తెలుసుకునేందుకే లాహోర్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. మోదీ తన పాక్ పర్యటనను (Pakistan Tour) గుర్తు చేసుకున్నారు. 2015 డిసెంబరులో అఫ్గానిస్థాన్ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడి నుంచి తిరిగొస్తూ ఆకస్మికంగా లాహోర్‌లో దిగిన విషయం తెలిసిందే.
Also Read: రూపే కార్డుపై బంపర్ ఆఫర్.. ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
ఆ రోజు ఆనాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కావడంతో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2004 తర్వాత ఓ భారత ప్రధాని దాయాది దేశంలో అడుగుపెట్టడం అదే తొలిసారి. ‘‘లాహోర్‌లో ఓ జర్నలిస్టు వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చానని అన్నారు. ఒకప్పుడు ఇది మా భారత్‌లో భాగమే కదా అని నేనన్నా. ఈ మధ్య పాక్ ప్రభుత్వం ఆందోళనగా ఉంది. దానికి నేను కూడా ఓ మూలకారణమని తెలుసు. మన దేశంలోనూ కొంతమంది కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి దాయాదిపై సానుభూతి చూపిస్తున్నారు. ముంబయి పేలుళ్లకు పాల్పడిన కసబ్ మనవాడేనంటూ మరో నేత అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతోంది’’ అని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.