PM Vishwakarma Scheme: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర' (PM Vishwakarma Yojana) పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ(Delhi)లో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కళాకారులకు, నిపుణులకు 'పీఎం విశ్వకర్మ' సర్టిఫికెట్లను అందజేశారు ప్రధాని. ఇదే సమయంలో ‘యశోభూమి’(ఐఐసీసీ)ని కూడా జాతికి అంకిత చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఒక కొత్త ఆశాకిరణమని పేర్కొన్నారు.
విశ్వకర్మ జయంతిని.. భారత సాంప్రదాయ కళాకారులు, నిపుణులకు అంకితం చేయడం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో నేడు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కొత్త ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు.
'యశోభూమి' రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం..
ద్వారకలో నిర్మించిన 'యశోభూమి'ని దేశానికి అంకితం చేస్తూ.. నేడు దేశంలో అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం-యశోభూమి కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు ప్రధాని. ఇక్కడ చేసిన పని విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల దృఢత్వం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 'యశోభూమి'లో 11 వేల మంది ఒకేసారి కూర్చునే వెసులుబాటు ఉంది. ప్రధాన హాలు, గ్రాండ్ బాల్‌రూమ్‌తో సహా ఈ 8-అంతస్తుల భవనాన్ని 73 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 15 సమావేశ గదులు ఉన్నాయి. ఇక్కడ సమావేశాలు నిర్వహించడమే కాకుండా సదస్సులు, ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు.
యశోభూమి..
Also Read:
Asia Cup 2023 final Live Score🔴: టాస్ ఓడిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్
Siemens: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు అవాస్తవం: సీమెన్స్ ఎండీ