Modi : జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ!

తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించిన మోదీకి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ.17,300 కోట్ల విలువైన బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తమిళనాడు ప్రగతిలో తూత్తుకుడి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు మోదీ.

Modi : జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ!
New Update

Modi In Tamilnadu : బీజేపీ(BJP) తమిళనాడు(Tamilnadu) పై ఫోకస్ పెంచినట్టుగా అర్థమవుతోంది. ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది. లోకల్‌గా ఉన్న లీడర్లతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్‌ అన్నామలై(Annamalai) చేపట్టిన పాదయాత్ర(Padayatra) విజయవంతంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రధాని మోదీ రూ.17,300 కోట్ల విలువైన బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.


విక్షిత్ భారత్ కోసం కృషి:
తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించిన మోదీ(PM Modi) కి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. తమిళనాడు ప్రగతిలో తూత్తుకుడి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. అనేక ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు జరుగుతుండడం మంచి విషయమన్నారు. ఈ ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమన్న మోదీ.. ఈ పరిణామాలలో 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్'(Shrestha Bharat) స్ఫూర్తిని కూడా చూడవచ్చు' అని అభిప్రాయపడ్డారు. నేడు దేశం మొత్తం 'విక్షిత్ భారత్' కోసం కృషి చేస్తోందని.. అందులో తమిళనాడు కూడా కీలక పాత్ర పోషిస్తుందని మోదీ కొనియాడారు.


రైలు మార్గం విద్యుదీకరణపై మోదీ మాట్లాడారు. దక్షిణ తమిళనాడు-కేరళ మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందన్నారు. రూ.5,000 కోట్ల విలువైన నాలుగు పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు మోదీ. ఇది రాష్ట్ర రహదారి కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని.. పర్యాటకం, పరిశ్రమలను కూడా పెంచుతుందన్నారు మోదీ.


వీడియో వైరల్:
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్ర తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రామేశ్వరత్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు!

#bjp-politics #tamilnadu #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి