/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Modi-2-jpg.webp)
తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికల ప్రచారంలో అధికార డీఎంకే (DMK) పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ఓ ఫ్యామిలీ కంపెనీగా అభివర్ణించారు. అవినీతికి ఫస్ట్ కాపీ రైట్ ఆ పార్టీదేనని ఎద్దేవా చేశారు. స్టాలిన్ కుటుంబమంతా తమిళనాడును లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. తమిళనాడును డీఎంకే పాత ఆలోచనలు, పాత తరం రాజకీయాల్లోనే ఉంచుతోందన్నారు. డీఎంకే కుటుంబ రాజకీయాల కారణంగా తమిళనాడు యువత ముందుకు వెళ్లే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ.
ఇది కూడా చదవండి:Morarji Desai: ఇందిరాకు ఎదురెళ్లిన ప్రధాని.. మొరార్జీ దేశాయ్ వర్థంతి నేడు
కుటుంబ రాజకీయాలు, అవినీతి, తమిళనాడు వ్యతిరేక సంస్కృతి.. ఈ మూడు కారణాలతో డీఎంకేను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు మోదీ. భాష, ప్రాంతం, విశ్వాసాల ఆధారంగా డీఎంకే ప్రజలను విభజిస్తోందన్నారు. ప్రజలు దీన్ని గమనించిన రోజు ఒక్క ఓటు కూడా పడదని డీఎంకేకు తెలుసు అని మోదీ అన్నారు. చెన్నైలో తన రోడ్ షో విజయవంతం కావడంపై సైతం ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
Thank you Chennai! Today was special. pic.twitter.com/9PuBCLAdni
— Narendra Modi (@narendramodi) April 9, 2024
சென்னை என் மனதை வென்றது!
இந்த ஆற்றல் மிக்க நகரத்தில் இன்றைய ரோட்ஷோ என் நினைவில் என்றும் நிலைத்திருக்கும். மக்கள் சேவையில் தொடர்ந்து கடினமாக உழைக்கவும், நமது தேசத்தை மேலும் வளர்ச்சியடையச் செய்யவும் மக்களின் ஆசிகள் எனக்கு வலுவைத் தருகின்றன.
சென்னையில் காணப்படும் இந்த உற்சாகம்,… pic.twitter.com/2gdpbqj5KR— Narendra Modi (@narendramodi) April 9, 2024
ఈ డైనమిక్ సిటీ ఈ అద్భుత అనుభవం తనకు శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రజల అందించిన ఆశీర్వాదాలు వారి సేవలో నిరంతరం కృషి చేయడానికి, మరియు మన దేశం మరింత అభివృద్ధి చెందడానికి తనకు శక్తినిచ్చాయన్నారు మోదీ. చెన్నైలో ప్రజలు చూపించిన ఉత్సాహం తమిళనాడు పెద్దఎత్తున ఎన్‌డిఎకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తోందని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
 Follow Us
 Follow Us