Pm Modi Congrats to Indian Hockey Players: భారత హాకీకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. మన ప్లేయర్లు అద్భుతంగా ఆడడమే కాకుండా మెడల్స్ కూడా సాదిస్తున్నారు. లాస్ట్ టైమ్ టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యం గెలుచుకున్న టీమ్ ఇండియా ఈసారి ఇంకా బాగా ఆడింది. నిజానికి ఈసారి కనీసం రజతం అయినా వస్తుంది అనుకున్నారు కానీ తృటిలో అది చేజారిపోయింది. అయితే భారత హాకీ ప్లేయర్లు కాంస్యాన్ని మాత్రం చేజార్చుకోలేదు. తమ అద్భుత ఆట తీరుతో పతకాన్నిదక్కించుకుంది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ (Hockey Team) అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది.
దీంతో ఇండియాలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారత జట్టుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. అంతేకాదు వారిని కంగ్రాట్యులేట్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ కూడా పెట్టారు. ఒలిపింక్స్‌లో రెండో సారి ఇంటికి కాంస్యాన్ని తీసుకువస్తున్న భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ మెడల్ చాలా ప్రత్యేకం అంటూ మోదీ అందులో రాశారు.
హాకీ జట్టు విజయంతో, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 4కి చేరుకుంది. షూటింగ్‌లో రెండు కాంస్యాలు వచ్చాయి. హాకీతో నాలుగో పతకం వచ్చింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ సాధించాడు. ఆట గెలిచిన తర్వాత ఆతను మాట్లాడుతూ..కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా ఉండదు. కానీ కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. మాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. కానీ భారత్‌కు ఇది వరుసగా రెండో కాంస్యం. చాలా ముఖ్యమైన విజయం సాధించాం ఆదరించండి అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు.
Also Read:Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు