ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన రష్యా!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు.రేపు భారత్-రష్యా సదస్సులో పుతిన్‌తో మోదీ భేటీకానున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.

ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన రష్యా!
New Update

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ స్వాగతం పలికారు.రేపు  భారత్-రష్యా సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.చర్చల అనంతరం రష్యాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి  ఆస్ట్రియాలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

అంతకుముందు, X లో ప్రధాని మోదీ చేసిన పోస్ట్‌లో, “ఈ పర్యటన రష్యా, ఆస్ట్రియాతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశమని తెలిపారు. నేను రెండు దేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులతో మాట్లాడటానికి  ఎదురుచూస్తున్నాను. గత 10 ఏళ్లుగా భారత్‌-రష్యా సంబంధాలు మెరుగయ్యాయి’’ అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు.

#russia #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe