PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదలవుతుంది. నవంబర్ 15, 2023న అర్హులైన రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ యోజన 15వ విడతను ప్రధాని మోదీ విడుదల చేశారు. జార్ఖండ్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 8 కోట్ల మందికి పైగా రైతులకు 18,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ప్రధాని విడుదల చేశారు. ఇప్పుడు 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేయనుంది. మీరు ఈ వాయిదా ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీ eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇది జరగకపోతే మీ ఇన్‌స్టాల్‌మెంట్(PM Kisan) నిలిచిపోవచ్చు. OTP ఆధారిత eKYC PMKSAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు అందుతుంది?
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, PM కిసాన్(PM Kisan) వాయిదా ప్రతి నాలుగు నెలలకు విడుదలవుతుంది. గత ఏడాది నవంబర్‌లో 15వ విడత విడుదలైంది. అటువంటి పరిస్థితిలో, 16 వ విడత ఫిబ్రవరి - మార్చి మధ్య విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. తదుపరి విడత విడుదలకు ఇంకా తేదీ నిర్ణయించలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) అనేది దేశంలో వ్యవసాయ భూమి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు వ్యవసాయ సంబంధిత పనులలో ఆర్థిక అవసరాలను తీర్చడానికి, ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి మూడుసార్లు ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (PM Kisan)కింద, భూమి ఉన్న రైతు కుటుంబాలందరికీ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది ప్రతి నాలుగు నెలలకు రూ. 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో లభిస్తుంది.
Also Read: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్!
ఈ పొరపాట్ల వల్ల వాయిదాలు నిలిచిపోవచ్చు
మీరు నిర్ణీత గడువులోగా భూ ధృవీకరణను పూర్తి చేయకపోతే, మీరు వాయిదాల ప్రయోజనం కోల్పోవచ్చు. నిబంధనల ప్రకారం ఈ పనిని పూర్తి చేయడం అవసరం. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ఇ-కెవైసి చేయడం కూడా తప్పనిసరి. మోసాలను నిరోధించడానికి అలాగే అనర్హులను గుర్తించడానికి E-KYC విధానం తీసుకువచ్చారు. మీరు మీ ఆధార్ కార్డ్‌ని మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోయినా కూడా మీరు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను కోల్పోవచ్చు. మీరు సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే, మీకు ఈ పథకం నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒకసారి మీ ఈకేవైసీ పూర్తి అయిందా లేదా. బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ అనుసంధానం జరిగిందా లేదా వెరిఫై చేసుకోవడం మంచిది. వెంటనే మీ సమీప CSC సెంటర్ ని సంప్రదించండి.
Watch this Interesting Video: