PM Kisan Alert : రైతులకు అలర్ట్...15వ విడత డబ్బు జమకాలేదా? డబ్బు వచ్చేస్తోంది..చెక్ చేసుకోండి..!!

పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు ప్రతీ రైతూ పొందాల్సిందే. అప్పుడు ఆ పథానికి ఒక అర్థం ఉంటుంది. అయితే తాజాగా 15వ విడత డబ్బు 2.4లక్షల మంది రైతుల అకౌంట్లో జమ కాలేదు. కొత్త అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే డబ్బు జమ అవుతుందని ఆన్ లైన్లో చెక్ చేసుకోవాలి.

New Update
PM Kisan Yojana: అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.!

PM Kisan: కేంద్రంలోని మోదీ (Modi) సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రతి ఏటా 3 విడతల్లో రూ. 6వేల లబ్దిదారులైన రైతుల అకౌంట్లో డబ్బు జమచేస్తోంది. తాజాగా 15వ విడత డబ్బును కూడా రైతుల అకౌంట్లో జమ చేసింది. అయితే కొంతమంది రైతులకు ఈ డబ్బు జమ కాలేదు. వారు డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి (PM Kisan Scheme) తాము అర్హులుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. అయినా కూడా డబ్బు జమకాలేదు. ఈ విధంగా ఎందుకు జరిగిందనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

తాజా రూల్స్ ప్రకారం పీఎం కిసాన్ డబ్బు పొందే రైతులు తప్పనిసరిగా ఇ కేవైసీ (e KYC) ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. తమ బ్యాంకు అకౌంట్లో డబ్బు జమకావాలంటే ఆ అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. అలా చేసిన వారికి మాత్రమే డబ్బు అందుతుంది. చెయ్యని వారికి డబ్బు జమకాదు. ఈ కారణంగానే ఇటీవల 2.4లక్షల మంది రైతులకు డబ్బు అందలేదు. కేంద్రం 13వ విడత నుంచి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. దీంతో అకౌంట్ ఎవరిది. ఆ లబ్ది పొందే రైతు ఎవరు. అనే వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకుంటే...ఆ కొత్త నెంబర్ కు ఆధార్ లింక్ చేయాలి. ఆ కొత్త అకౌంట్ నెంబర్ ను పీఎం స్కీం కింద ఇవ్వాలి. దీంతో ఆ కొత్త అకౌంట్లోకి డబ్బు జమ అవుతుంది. ఆధార్ లింక్ చేయని వారు..రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ పని పూర్తి చేసుకోవాలి. లేదా ఆన్ లైన్ విధానం ద్వారా వారే స్వయంగా ఈ పని చేసుకోవచ్చు.

బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసుకున్నాక..ఆయా రైతులకు రావాల్సి డబ్బు వారి అకౌంట్లోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. అందుకే ఆధార్ లింక్ చేసిన రైతులు, తమ అకౌంట్లోకి డబ్బు వచ్చిందేమో చూసుకోవాలి. లేదంటే బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకోవాడనికి ముందు మీ అకౌంట్ ఉణ్న బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి అందులో మీ డెబిట్ కార్డుతో పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సెక్షన్ లో ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇవ్వండి. మీది సేవింగ్స్ అకౌంట్ లేదంటే కరెంట్ అకౌంటా అనేది చెప్పాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే బటన్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ రిజిస్టర్డ్ నెంబర్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆన్ లైన్ లో కూడా ఈవిధంగా చేయవచ్చు.

ఇది కూడా చదవండి: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!

Advertisment