Farmer funds: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే నిధుల విడుదల!

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ నిధులను జూన్ 18న ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని స్పష్టం చేశారు.

New Update
Farmer funds: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే నిధుల విడుదల!

Pm kisan: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులను జూన్ 18న ప్రధాని మోదీ విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందించే సాయం 17 విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ నెల 18 తేదీన ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ కానున్నాయి.

ఇది కూడా చదవండి: Raja Singh: జగన్ పై రాజాసింగ్ సంచలన ఆరోపణలు.. కన్వర్ట్‌డ్ క్రిస్టియన్ అంటూ!

ఇదిలా ఉంటే.. మోదీ మూడో సారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు తొలి సంతకం పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల పైనే పెట్టారు. ఈ పథకం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకూ రూ. 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు చౌహన్ వెల్లడించారు. ప్రతిఏటా 9.3 కోట్ల మంది రైతులు రూ.20వేల కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు