PM Kisan Funds Release: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో అనుబంధం ఉన్న రైతులకు ఇది శుభవార్త. 16వ విడతలో రూ.2000 మొత్తాన్ని కేంద్రం ఇవాళ జమ చేయనుంది. రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ నేరుగా బదిలీ చేయనున్నారు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 16వ విడతను ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు. అంటే మరో కొన్ని గంటల్లో రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు పడతాయి.
దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6000 మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా.. అంటే ప్రతీసారి రూ. 2000 చొప్పున విడుదల చేస్తారు. నవంబర్ 2023లో పీఎం కిసాన్ 15వ విడతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు 16వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు ఈ విధంగా జమ చేస్తారు. ఇక గతేడాది ఫిబ్రవరి 27న ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం తెలిసిందే.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలో కింద చదవండి:
మీ ఖాతాలో డబ్బు రాకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
--> ముందుగా పీఎం కిసాన్‌లోని లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయండి.
--> PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ని విజిట్ చేయండి.
--> లబ్ధిదారుల జాబితా అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
--> వెబ్‌సైట్ పేజీలోకి వెళ్లండి.
--> వివరాలను ఎంచుకోండి.
--> ఇలా రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్‌తో పాటు గ్రామాన్ని ఎంచుకోండి.
--> చివరగా గెట్ రిపోర్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
--> వెంటనే లబ్ధిదారుల జాబితా గురించిన సమాచారం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.