PM Kisan: అన్నదాతలకు గుడ్ న్యూస్...అకౌంట్లోకి రూ. 12వేలు..!!

రైతులకు శుభవార్త. బ్యాంక్ అకౌంట్లోకి రూ. 12వేలు జమ కానున్నాయి. ఏటా ఈ ప్రయోజనం లభించనుంది.

PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
New Update

రైతులకు గుడ్ న్యూస్. ఇకపై అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు జమకావొచ్చు. ఎలా అనుకుంటున్నారా. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే. అన్నదాతలకు రూ. 6వేలు కాకుండా ఏకంగా రూ. 10వేల పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయోజనం ఎవరెవరికి వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతిఏటా అర్హత కలిగిన రైతులకు రూ. 6వేల చొప్పున లభిస్తున్నాయి. ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి. అంటే రూ. 2వేల చొప్పున వస్తున్నాయి. 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు రైతుల బ్యాంకు అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఇప్పటికే 15 విడతల డబ్బులు వచ్చాయి. అంటే ఒక్కో రైతుకు మోదీ ప్రభుత్వం ఏకంగా రూ. 30 వేలు అందించింది. ఇక రానున్న కాలంలో 16వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

అయితే దేశంలోని కొంతమంది రైతులకు మాత్రం రూ. 12వేలు పొందే అవకాశం ఉంది. ఎలా అనుకుంటున్నారా. ఈ విషయం తెలసుకుందాం. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు ప్రత్యేకంగా మరో స్కీమ్ కూడా అందిస్తోంది. దీని పేరే కల్యాణ్ యోజన. అక్కడి ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 4వేలు అందిస్తుంది. అంటే పీఎం కిసాన్ స్కీమ్ కు అదనం. దీని వల్ల రైతుల బ్యాంక్ అకౌంట్లోకి నేరు రూ 10వేలు జమ అవుతూ ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో అక్కడి ప్రభుత్వం రూ. 4వేల సాయాన్ని రూ. 6వేలకు పెంచుతామని ప్రకటించింది. దీని వల్ల రైతులు ఇప్పుడు రూ. 12వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.

అయితే అన్నదాతలు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు లభిస్తేనే కిసాన్ కల్యాణ్ యోజన కింద కూడా డబ్బులు అందుతాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రాకుంటే అప్పుడు కల్యాణ్ స్కీమ కింద డబ్బులు రావని గుర్తుంచుకోవాలి. మరోవైపు పీఎం కిసాన్ స్కీం కింద అందించే రూ. 6వేల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని రూ. 8వేలు చేయోచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే చాలా మంది రైతులకు ఊరట కలుగుతుంది.

ఇది కూడా చదవండి: అక్కడ అధికారం ఎవరిది? ఛత్తీస్‌గఢ్ లో ఆసక్తికరంగా పోరు!

#pm-kisan #pm-kisan-beneficiaries
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe