PM Kisan Scheme : రైతులకు తీపికబురు..అకౌంట్లలోకి మరో రూ.2 వేలు.!

రైతులకు పండగలాంటి వార్త. ఏం వార్త అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవల్సిందే. మళ్లీ అకౌంట్లోని డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

PM Kisan Scheme : రైతులకు తీపికబురు..అకౌంట్లలోకి మరో రూ.2 వేలు.!
New Update

PM Kisan Scheme : కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అన్నదాతలకు ఈ పథకం కింద నేరుగా బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరుతున్నాయి. ఇది చాలా సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్నారు. మోదీ సర్కార్ ఈ స్కీం కింద ఇప్పటికే 16 విడతలుగా డబ్బులను అకౌంట్లో జమ చేసింది. అంటే రైతులకు నేరుగా రూ. 32వేలు లభించాయి. ఇక 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ మొత్తం ఎప్పుడు వస్తుంది..ఎవరికి వస్తుంది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో రూ. 6వేల చొప్పును పీఎం కిసాన్ పథకం కింద రైతులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తోంది. అంటే 4 నెలలకు ఒకసారి డబ్బులు జమ అవుతాయి. అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు నేరుగా వచ్చి జమ అవుతాయి. ఫిబ్రవరి నెల చివరిలో మోదీ ప్రభుత్వం 16వ విడత డబ్బులను రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. అంటే ఇప్పుడు 17 వ విడదత డబ్బులను పీఎం కిసాన్ స్కీం కింద జులై నెలలో కేంద్రం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ మొత్తం వస్తే అన్నదాతలకు మొత్తంగా రూ. 34 వేలు వచ్చినట్లవుతుంది. ఎన్నికల నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై స్పందించింది. పీఎం కిసాన్ డబ్బుల పెంపు గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర స్పష్టం చేసింది.

పీఎం కిసాన్ పొందాలనుకునేవారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అలాగే ఆధార్ బ్యాంకు అకౌంట్ లింక్ వంటివి కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు బ్యాంకు అకౌంట్లోకి వస్తాయి.

ఇది కూడా చదవండి: 96వ ఆస్కార్ వేడుకలకు సమయం ఆసన్నమైంది…ఎక్కడ చూడొచ్చంటే..!

#pm-kisan-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe