PM Kisan Update: రైతులకు అలెర్ట్.. ఇలా చేయకపోతే మీకు పీఎం కిసాన్‌ నిధులు కట్!

పీఎం కిసాన్‌ నిధులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీని పూర్తి చేయాలి. ఇక భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్‌ 17వ విడతను కేంద్రం జూన్లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.

New Update
BREAKING: త్వరలో వారికి రూ.12 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన

PM Kisan 17th Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రతి ఏటా మూడు విడతల ద్వారా రైతుల ఖాతాలకు పంపుతుంది. ఒక్కో విడత కింద రూ.2 వేలు రైతుల ఖాతాలోకి వస్తుంది. ఇటీవల ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 16వ విడత సొమ్మును రైతుల ఖాతాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. 16వ విడత డబ్బులు బదిలీ చేసి చాలా రోజులు గడిచాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ లేదా జూలై నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చు. అయితే నగదు బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. అవి తెలుసుకోని పాటించకపోతే మీ డబ్బులు ఆగిపోవచ్చు.

--> దేశవ్యాప్తంగా కొంతమంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను తప్పుగా పొందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే అర్హత ఉన్నవాళ్లు కొన్ని నిబంధనలు పాటించడం లేదు. దీని కారణంగా వాళ్లు నిధులు పొందలేకపోతున్నారు. మరికొందరు దొడ్డిదారిన పొందుతున్నారని తెలుస్తోంది. అందుకే కేంద్రం ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఇ-కేవైసీ, భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.

--> మీరు 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి.

--> మీరు ఈ రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే తదుపరి 17వ విడత ప్రయోజనం పొందలేరు. ఇది కాకుండా, పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే 17వ విడత ప్రయోజనం లభించదు.

Also Read: హోలీ ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
తాజా కథనాలు