PM Kisan Yojana: అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.!

పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ముఖ్యగమనిక. 17వ విడత డబ్బులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ..మే ఆఖరి వారం లేదంటే జూన్ తొలివారంలో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం.

PM Kisan Yojana: అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.!
New Update

PM Kisan Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చింది .అందులో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6వేల సాయం అందిస్తుంది. విడతల వారీగా వీటిని విడుదల చేస్తుంది. ఇఫ్పుడు 17వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజా అప్ డేట్ ఉపశమనం కలిగించేలా ఉంది. ఇప్పటివరకు మొత్తం 16 విడతల్లో ఒక్కొక్కరికి రూ. 32వేలు అందించింది. ఇప్పుడు 17వ విడత నిధులు కోసం ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 16వ విడత డబ్బులు ప్రధాని మోదీ..ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్ వేదికగా రిలీజ్ చేశారు. అప్పుడు 9కోట్ల మందికి రైతులు ఈ స్కీం ద్వారా ప్రయోజనం పొందారు.

అయితే 17వ విడత నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది. అయితే ఇ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రం 17వ విడత డబ్బులు పడతాయని సమాచారం. కేంద్రం ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఇ కేవైసీ పూర్తి చేసినందుకు ఎన్నో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్ డేట్ చేసుకోవచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇచ్చి పని పూర్తి చేసుకోవచ్చు. ఇంకా pmkisan.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. PM Kisan GOI App ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్‌తోనే కేవైసీని పూర్తి చేయవచ్చు.

నమోదు చేసుకోవడం ఎలా?

-ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.

-ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

-ఇప్పుడు కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

-ఆ తర్వాత రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.

-ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. రాష్ట్రం పేరు ఎంచుకొని.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి.

-తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

-రాష్ట్రం, జిల్లా, బ్యాంక్ డీటెయిల్స్, ఇతర పర్సనల్ డీటెయిల్స్ అడిగిన సమాచారం నమోదు చేయాలి.

-తర్వాత ఆధార్ కార్డు ధ్రువీకరణ పూర్తి చేస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: ఎంత పనిచేశావ్ మహాలక్ష్మీ..భారీగా తగ్గిన బస్ పాసులు..!

#17th-installment #pm-kisan-yojana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe