mosquito tips: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్!

దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్‌ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి.

mosquito tips: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్!
New Update

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వల్ల కాలం కానీ కాలంలో వానలు (Rains)  పడటం వల్ల దోమలు (Mosquitoes) విపరీతంగా పెరుగుతున్నాయి. దోమలు అనేక వ్యాధులకు (Health problems) మూలకారణాలౌతున్నాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్‌ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి.

అయితే దోమల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది అనేక పద్దతులు అనుసరిస్తుంటారు. కొందరు దోమ తెరలు కట్టుకుంటే..కొందరు దోమలను తరిమి కొట్టడానికి రకరకాల మస్కిటో కాయిల్స్ ను ఉపయోగిస్తుంటారు. అలౌట్లు, రిఫిల్స్‌, జెట్‌ కాయిల్స్‌, అగరు బత్తిలు ఇలా రకరకల పద్దతులు వినియోగిస్తున్నారు.

అయితే ఇంటిలోనే కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల దోమలను తరిమి కొట్టవచ్చు అని మనం తెలుసుకుందాం.
బంతి మొక్కలు: బంతి మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే కనుక దోమలు పారిపోతాయి. దీనిలో ఉండే పైరేత్రం అనే పదార్థం కీటక నివారిణిగా పని చేస్తుంది. బంతి మొక్కలు కుండీల్లో, నేల మీద కూడా పెంచుకోవచ్చు.

సిట్రనెల్లా: ఘాటైన వాసన కలిగిన ఈ మొక్క దోమల నివారిణిగా చెప్పుకోవచ్చు. ఈ మొక్క ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు.

లెమన్ బామ్‌: పుదీనా కుటుంబానికి చెందిన లెమన్‌ బామ్‌ మొక్క హార్స్‌ మింట్‌ గా ఈ మొక్కను పిలుస్తారు. దీని సువాసనకు దోమలను తరిమికొట్టే శక్తి ఉందని తెలుస్తుంది. ఆకులను ఎండబెట్టి టీ పొడిగా చేసుకుని తాగవచ్చు కూడా. ఈ చెట్టును ఇంటి పెరట్లో పెంచుకోవటం వల్ల దోమలు రాకుండా తరిమికొట్టవచ్చు.

జెరానియ: ఈ మొక్కను కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ఉండే నిమ్మ సువాసనకు దోమలు పారిపోతాయి. దీనిని ఇంటి ముందు కుండీల్లో లేదా విడిగా కూడా పెంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

మాచిపత్రి: మాచిపత్రి దీనిని చాలా చోట్ల దవణంగా అని పిలుస్తారు. ఈ మొక్క వెదజల్లే సువాసనలకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

జామాయిల్‌, నిమ్మ నూనె కలిపి ఇంటి కిటికీలకు దోమలు ఇంట్లోకి ప్రవేశించే చోట వాటిని చల్లటం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి కషాయంలా చేయాలి. కొంచెం నిమ్మగడ్డి నూనె కలిపి ఇంట్లో స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే దోమలు దరిచేరవు.

#mosquitoes #health-problems #plants
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి