New Year : న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ తక్కువ ధరకే మద్యం.. ఎక్కడంటే?

న్యూ ఇయర్ కోసం పార్టీ ప్లాన్ చేస్తున్నారా? అయితే పొరుగున ఉన్న గోవాలో అతి తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.గోవాలో రూ.100కి లభించే మద్యం హర్యానాలో రూ.134, రాజస్థాన్‌లో రూ.213, మహారాష్ట్రలో రూ.226. ఇక తెలంగాణలో రూ.246కు విక్రయిస్తున్నారు.

New Update
Telangana: మద్యం అమ్మకాలు, ఆదాయంలో తెలంగాణే టాప్..!

Liquor Rates Dropped On Effect of 2024  : కొన్నిరోజుల్లో న్యూఇయర్(New Year 2024) రాబోతుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి..కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు యువత రెడీ అవుతోంది. ముఖ్యంగా డిసెంబర్ 30,31 తేదీల్లో పార్టీలతో యూత్ ఛిల్ అవుతుంది. పార్టీలు, పబ్ లు అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్(Liquor) లేనిదే పార్టీ పూర్తికాదు. కాబట్టి న్యూఇయర్ వేడుకల కోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తుంటారు. అయితే మన రాష్ట్రంలో ఆల్కహాల్ ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే నిషేధించారు. మీరు తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేయాలంటే ఎక్కడి వెళ్లాలి. ఎక్కడ తక్కువ ధరకు మద్యం లభిస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను బట్టి మద్యం ధర ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. తక్కువ ధరలకు మద్యం విక్రయించే ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో అతి తక్కువ ధరకు మద్యం ఎక్కడ లభిస్తుందో తెలుసా? మన రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ధరకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో మద్యంపై భారీగా పన్ను విధిస్తున్నారు. గుజరాత్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. దీంతో ఇక్కడి మద్యం ప్రియులు పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ది ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం, విస్కీ, రమ్, వోడ్కాచ జిన్ బాటిల్ ధర రూ.100. ఢిల్లీలో రూ. 134, కర్ణాటకలో రూ. 513, ఉత్తరప్రదేశ్‌లో రూ. 197కి విక్రయించబడుతుంది.గోవాలో రూ.100కి లభించే మద్యం హర్యానాలో రూ.134, రాజస్థాన్‌లో రూ.213, మహారాష్ట్రలో రూ.226. ఇక తెలంగాణలో రూ.246కు విక్రయిస్తున్నారు. రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ధరలు నిర్ణయించబడతాయి.

పొరుగున ఉన్న గోవాలో అతి తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గోవా(Goa) లో MRPపై 49శాతం వసూలు చేస్తారు. మహారాష్ట్రలో 71శాతం, కర్ణాటకలో 83శాతం పన్ను విధిస్తున్నారు.గుజరాత్ లిక్కర్ ప్రొహిబిషన్ పాలసీ 1960 ప్రకారం, గుజరాత్‌లో మద్యం వినియోగం, అమ్మకం లేదా తయారీ నిషేధించబడింది. అయితే స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు గుజరాత్‌లోని 64 హోటళ్ల నుంచి భారత్‌లో తయారైన విదేశీ మద్యం విక్రయానికి గుజరాత్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంతో సహా దేశంలోనే అత్యధిక మద్యం విక్రయాలు జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నూతన సంవత్సరానికి ముందు మూడు రోజుల్లో ఖజానా నిండుతుందని ఎక్సైజ్ శాఖ నిర్ధారించింది. మీరు కూడా న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నట్లయితే గోవా నుంచి మద్యం కొనుగోలు చేయడం మంచిది.

ఇది కూడా చదవండి: తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి సంపదకు ఈ దేవుళ్లే కాపలా ఉంటారట..!!

Advertisment
తాజా కథనాలు