Plane crash in Philippines: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత విమానం అదృశ్యమైంది. అనంతరం ఈ విమాన శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలిప్పీన్స్‌లో చిన్న విమానం కూలిపోవడంతో భారతీయ పైలట్, ఫిలిప్పీన్స్ శిక్షకుడు మరణించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. రెండు సీట్లున్న సెస్నా విమానం అపయావో ప్రావిన్స్‌లో కుప్పకూలిందని, ఇద్దరు వ్యక్తులు మరణించారని ఫిలిప్పీన్స్ అధికారిక వార్తా సంస్థ నివేదించింది.
విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యాక అదృశ్యం:
ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి కెప్టెన్ అడ్జెల్ జాన్ లుంబావో టబుజో, ట్రైనీ పైలట్ అన్షుమ్ రాజ్‌కుమార్ కొండే మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. లావోగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 12:16 గంటలకు ఎకో 'ఎయిర్ సెస్నా 152' విమానం టేకాఫ్ అయిన తర్వాత అదృశ్యమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. విమానం మధ్యాహ్నం 3:16 గంటలకు తూగేగారావు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది, కానీ అది అక్కడ ల్యాండ్ కావడంలో విఫలమైంది. బుధవారం మధ్యాహ్నం అపయావో ప్రావిన్స్‌లో విమాన శకలాలు లభ్యమైనట్లు తెలిపారు.
సూడాన్‌లో విమాన ప్రమాదంలో 9 మంది మృతి:
కొద్ది రోజుల క్రితం, సూడాన్‌లోని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన తర్వాత పౌర విమానం కూలిపోవడంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు. ఈశాన్య ఆఫ్రికా దేశంలో సోమవారంతో 100 రోజుల యుద్దం పూర్తయిందని, వివాదాన్ని తగ్గించే అవకాశం లేదని సైన్యం తెలిపింది.
కాలిఫోర్నియాలోనూ కూలిన చిన్న విమానం :
గతంలో కాలిఫోర్నియా విమానాశ్రయం సమీపంలో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో మంటలు చెలరేగి ఆరుగురు మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా ప్రకారం, లాస్ ఏంజెల్స్‌కు ఆగ్నేయంగా 130 కి.మీ దూరంలో ఉన్న మురియెటాలో ఉదయం 4.15 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో, విమానంలో మంటలను ఆర్పడానికి 1 గంటకు పైగా పట్టింది.
Also Read: బరిలోకి దూకుతున్న తెలుగు కుర్రాడు.. ఇవాళ్టి నుంచి విండీస్‌తో టీ20 ఫైట్!