Plane crash in Philippines: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత విమానం అదృశ్యమైంది. అనంతరం ఈ విమాన శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిలిప్పీన్స్‌లో చిన్న విమానం కూలిపోవడంతో భారతీయ పైలట్, ఫిలిప్పీన్స్ శిక్షకుడు మరణించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. రెండు సీట్లున్న సెస్నా విమానం అపయావో ప్రావిన్స్‌లో కుప్పకూలిందని, ఇద్దరు వ్యక్తులు మరణించారని ఫిలిప్పీన్స్ అధికారిక వార్తా సంస్థ నివేదించింది.
పూర్తిగా చదవండి..ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం..భారతీయ పైలట్‌తో సహా ఇద్దరు మృతి..!!
ఫిలిప్పీన్స్ లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. రెండు సీట్లున్న చిన్న సెస్నా విమానం అపయావో ప్రావిన్స్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పైలట్ భారతీయుడని ఫిలిప్పీన్స్ అధికారిక వార్త సంస్థ నివేదించింది.
Translate this News: