Plane Crash In Brazil: బ్రెజిల్లో కుప్పకూలిన విమానం...14మంది దుర్మరణం..!! బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఓ విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మేయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు. By Bhoomi 17 Sep 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఓ విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మేయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. "శనివారం బార్సిలోనాలో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను" అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Plane crash in Brazil's Amazon state leaves 14 dead -CNN https://t.co/n1mJfbDwhs pic.twitter.com/fMnVnQ1ZwJ — Reuters (@Reuters) September 16, 2023 ఇది కూడా చదవండి: జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి..!! అవసరమైన సహాయం అందించేందుకు మా బృందాలు పని చేయడం ప్రారంభించాయని అమెజాన్ గవర్నర్ తెలిపారు. " మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు తెలియజేస్తున్నానని " అని అతను చెప్పారు. మరోవైపు మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి ఇంకా సమాచారం లేదు. ఇది కూడా చదవండి: మోదీ గురించి ఈ విషయాలు ఎవరికి తెలియవు.. ఇప్పుడు మీరు తెలుసుకోండి..!! గోప్యత కారణంగా మేము తదుపరి సమాచారాన్ని అందించలేమని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్ తెలిపింది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ అవసరమైన అన్ని సమాచారం, అప్‌డేట్‌లు ఇస్తామని చెప్పారు. మరణించిన వారిలో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిలియన్ మీడియా సంస్థలు నివేదించాయి. అయితే, రాయిటర్స్ ఆ నివేదికలను ధృవీకరించలేదు. #plane-crash-in-brazil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి