Plan for Brajamandal Yatra in Nuh : హర్యానాలోని (Haryana) నుహ్ లో జరిగిన హింసాకాండ తర్వాత మరోసారి బ్రజ్ మండల్ శోభాయాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 28న హిందూ సంస్థ ఈ ఊరేగింపును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా 144 సెక్షన్ విధించారు. విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 28న మళ్లీ బ్రజమండల యాత్ర చేపడతామని ప్రకటించడంతో మళ్లీ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఆగస్టు 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నిషేధించారు. ఆగస్టు 28న మళ్లీ యాత్ర చేపట్టేందుకు వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలకు నూహ్ జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. అయితే హిందూ సంస్థలు మాత్రం యాత్రను చేపట్టేందుకు మొండికేస్తున్నాయి. దీంతో యంత్రాంగం అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు.
ఇది కూడా చదవండి:సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం: ఇస్రో చీఫ్..!!
నుహ్‌లో యాత్రను మరోసారి చేపట్టాలని వీహెచ్‌పీ మొండిగా వ్యవహరిస్తుండగా, దుండగులు మరోసారి దాడి చేసే అవకాశం ఉందని పోలీసులు వాధిస్తున్నారు. అందుకే యాత్రకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. హర్యానా పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు ట్వీట్ చేయడం ద్వారా నుహ్‌లో ఎలాంటి ర్యాలీలు, శోభాయాత్రల్లో పాల్గొనకూడదని పోలీసులు తెలిపారు. దీంతో పాటు ప్రజలు కూడా ఇందులో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. యాత్రను రద్దు చేస్తూ నూహ్ పరిపాలన సెక్షన్ 144 విధించింది.
సోమవారం జరిగిన సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర చేపట్టాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. ఈసారి శోభా యాత్రలో స్థానికులు మాత్రమే పాల్గొంటారని వీహెచ్‌పీ చెబుతోంది. బయటి నుంచి భక్తులెవరూ రారని వెల్లడించింది. VHP ఆగస్టు 28న ఉదయం 11 గంటలకు హర్యానాలోని దేవాలయాల్లో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో పాటు మేవత్, నల్హాద్ మహాదేవ్, జీర్ మహాదేవ్, రిగరేశ్వర్ ఆలయాల వరకు ఊరేగింపుగా జలాభిషేకం చేసే కార్యక్రమం కూడా జరిగింది. అదే సమయంలో, యాత్రకు బదులు, వారి ఇళ్ల సమీపంలోని దేవాలయాలలో జలాభిషేకం నిర్వహించాలని పరిపాలన విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో జాత్యాహంకార దాడి…ఫ్లోరిడాలో ముగ్గురు నల్లజాతీయులు మృతి..!!
కాగా జూలై 31 బ్రజ్ మండల్ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా యాత్రపై రాళ్ల దాడి జరగడంతో రెండు వర్గాల మధ్య హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై కూడా దాడికిపాల్పడ్డారు. ఈ హింసాకాండ నుహ్ నుంచి ఫరీదాబాద్ గురుగ్రామ్ వరకు వ్యాపించింది. నుహ్ హింసాత్మక ఘటనలో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ తోపాటు పలు చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. నుహ్ లో కర్య్పూ విధించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి 312మందిని అరెస్టు చేశారు. ఒక గురుగ్రామ్ లోనే ఈ హింసకు సంబంధించి 37కేసులు నమోదు అయ్యాయి.