తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపుమీదుంది. బీఆర్ఎస్ దూసుకుపోతుండగా..కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలను ప్రకటించి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. బీజేపీ ఇంకా మ్యానిఫెస్టోను ప్రకటించాల్సింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం షురూ కావడంతో క్యాంపెయింగ్ పై బీజేపీ ఫోకస్ పెడుతున్నది. పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నేతలపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాను, ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకుని తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ అయిన నాయకుడు బండి సంజయ్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..అదుపు తప్పిన బస్సు..ఒకరు దుర్మరణం..!!
బండి సంజయ్ కరీంగనర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈనెల 6వ తేదీని ఆయన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ పట్టణం నుంచి ఈ పాదయాత్ర షురూ చేయనున్నట్లు సమాచారం. అయితే ఆయన పాదయాత్ర కేవలం కరీంనగర్ నియోజకవర్గానికే మాత్రమే పరిమితం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈనెల 7వ తేదీన కరీంనగర్ లో పాదయాత్రను ప్రారంభించి...8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ గతంలో చేసిన పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి. పట్టణాలకే బీజేపీ పరిమితమనే ముద్రను చెరిపేసే ప్రయత్నాలు చేశారు.
అందులో భాగంగా పార్టీని పల్లెల్లోకి తీసుకెళ్లడంతో కొంతవరకు సక్సెస్ అయిన బండిసంజయ్ మరోసారి పాదయాత్రను తాను పోటీ చేయనున్న కరీంగనర్ నియోజకవర్గంలో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి...కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2014, 2018లలో పోటీ చేసిన పరాజయం పొందారు.
ఇది కూడా చదవండి: ఇస్రో మాజీ చీఫ్ శివన్‌పై సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘చంద్రయాన్-2 ఫెయిల్యూర్‌పై’!