/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T073921.393.jpg)
Pinnelli Ramakrishna Reddy Arrest : ఈరోజు హైకోర్టు (High Court) లో మాచర్ల (Macherla) వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట లోని మాజీ మంత్రి అనిల్ నివాసం ఉన్నట్లు సమాచారం. అనిల్ ఇంటి నివాసం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకే పోలీసులు మాజీ మంత్రి నివాసానికి చేరుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
Follow Us